Begin typing your search above and press return to search.

పవన్ రోడ్డు మీదకు... బస్తీ మే సవాల్...?

By:  Tupaki Desk   |   3 Sep 2022 3:30 PM GMT
పవన్ రోడ్డు మీదకు... బస్తీ మే సవాల్...?
X
పవన్ కళ్యాణ్ అత్యంత జనాదరణ ఉన్న వెండి తెర కధానాయకుడు. ఆయన రాజకీయాల్లోనూ కొనసాగుతున్నా ఆయన సినిమాటిక్ చరిష్మా అలాగే పదిలంగా ఉంది.  పవన్  ఒక్కసారి కనుక తానుగా  డిసైడ్ అయి కాలు తీసి బయటపెడితే అక్కడ ఆయన నిలుచున్న చోటనే అతి పెద్ద  జన సంద్రమే అవుతుంది. పవన్ ఎన్నికల రాజకీయాలో ఓడిపోవచ్చు కానీ జనాదరణలో మాత్రం ఎపుడూ విజేతగానే ఉంటున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ సాధారణంగా జనాలలోకి వెళ్లాలని అనుకోరు. నేను కనుక పాదయాత్రలు లాంటివి చేస్తే ఇబ్బంది అవుతుంది.  జనాలను కంట్రోల్ చేయడం బహు కష్టం అని ఆయనే చెబుతూ ఉంటారు.

ఇక పవన్ ఎన్నికల కోసం బస్సు యాత్రను అక్టోబర్ 5 నుంచి చేపట్టాలనుకుంటున్నారు. దాని మీద పూర్తి రోడ్ మ్యాప్ ఇంకా రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా పవన్ ఒక్కసారిగా వైసీపీ సర్కార్ మీద ఫైర్ అయ్యారు. ఏమనుకుంటున్నారు జనసేన అంటే. మీరు మా పార్టీ జెండాను చూస్తేనే వణికిపోతున్నారు. మా పార్టీ నాయకులు జెండా దిమ్మెను ఏర్పాటు చేసుకుంటే కూలగొడతారా అంటూ పవన్ వైసీపీ ప్రభుత్వం మీద మండిపోయారు.

మీరు ఇలాగే చేస్తూ పోతే చూస్తూ ఊరుకుంటామనుకున్నారా నేను రోడ్డు మీదకు రావాల్సి వస్తుంది అని పవన్ గట్టిగానే హెచ్చరించారు. నేను కనుక వస్తే అపుడు సర్కార్ తోనే తేల్చుకుంటాను అని ఆయన గట్టిగానే చెప్పారు. ఒక విధంగా పవన్ వైసీపీకి సవాల్ చేశారు. పవన్ కనుక చెప్పినట్లుగా రోడ్డు మీదకు వస్తే తట్టుకోవడం సాధ్యమేనా అన్న చర్చ అయితే సాగుతోంది. పవన్ వెంట వేలాదిగా జనాలు వస్తే వారంతా రోడ్డు మీదకు వస్తే అపుడు ఆ ఉద్యమాన్ని ఆపడం సర్కర్ తరం అవుతుందా అన్న మాట కూడా వినిపిస్తోంది.

నిజానికి జెండా దిమ్మెలను పార్టీ మీద అభిమానంతో జనసేన ఏర్పాటు చేసుకుంటే తప్పు ఏమిటి అన్నదే ఇక్కడ పాయింట్. ఈ విషయంలో పోలీసుల అనుమతి తీసుకోవాలి. మిగిలిన పర్మిషన్లు తీసుకోవాలి అంటున్నారు. ఆ విధంగా వైసీపీ వారు అయినా మరో పార్టీ అయినా తీసుకుంటోందా అన్నది కూడా పాయింటే మరి. మొత్తానికి పవన్ మా పార్టీ వారిని అన్యాయంగా అరెస్ట్ చేస్తే తాను రోడ్డు మీదకే వస్తాను అని హెచ్చరించారు. ఒక విధంగా పవన్ పొలిటికల్ మూడ్ చూస్తే ఆయన రోడ్డు మీదకే రావాలను చూస్తున్నారు.

ఆయన పెట్టుకున్న అక్టోబర్ 5  షెడ్యూల్ ని దాటించేసి ముందుగానే పవన్ని బయటకు తెస్తే అది అధికార వైసీపీకి ఎంత మేరకు రాజకీయ లాభ నష్టాలను చేకూరుస్తుంది అన్నది చెప్పడం అయితే కష్టమే. ఎందుకంటే పవన్ కి ఉన్న ఫాలోయింగ్ అపారం. ఆయన అగ్రెస్సివ్ మోడ్ లో జనాల్లోకి వస్తే ఏపీలో పొలిటికల్ సీన్ లో కూడా సడెన్ చేంజెస్ కూడా వచ్చినా రావచ్చు. మరి ఏమి కోరుకుని వైసీపీ జనసేనకు రెచ్చగొడుతోందో చూడాల్సి ఉంది అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.