Begin typing your search above and press return to search.

బీజేపీకి ప‌వ‌న్ ఊడిగం చేయ‌క‌పోయినా కీలుబొమ్మేనా...!

By:  Tupaki Desk   |   1 Nov 2022 8:00 AM IST
బీజేపీకి ప‌వ‌న్ ఊడిగం చేయ‌క‌పోయినా కీలుబొమ్మేనా...!
X
నిజ‌మే.. బీజేపీకి తాను ఊడిగం చేయ‌ను.. అన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ వ్యాఖ్య‌ల్లో ఆత్మ‌గౌర‌వం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఏపీ ప్ర‌జ‌లు కూడా ఇదే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆత్మ‌గౌర‌వం కోసం తాను శ్ర‌మిస్తాను.. అని గతంలోనే ప‌వ‌న్ సంక‌ల్పం చెప్పుకొన్నారు. కాబ‌ట్టి ఆయ‌న బీజేపీకి ఊడిగం చేస్తార‌ని కానీ చేయాల‌ని కానీ ఎవ‌రూ కోరుకోవ‌డం లేదు. బీజేపీ నేత‌లు ఒక‌వేళ అలా అని అనుకుంటే త‌ప్పువారిదే అవుతుంది. ఇక‌, విష‌యానికి వ‌స్తే.. ప‌వ‌న్ నిజంగానే బీజేపీకి ఊడిగం చేయ‌డం లేదు. కానీ, అంత‌కు మించి అన్న‌త‌ర‌హాలో వారి చేతిలో కీలుబొమ్మ‌గా మారిపోయాడ‌నేది విమ‌ర్శ‌.

ఊడిగం చేసేవారికి కూడా అంతో ఇంతో ఆత్మాభిమానం ఉంటుంది. కానీ, కీలుబొమ్మ‌ల‌కు ఉండ‌దు క‌దా! ఇంత ఘాటైన విమ‌ర్శ‌లు జాతీయ మీడియా లోనే వ‌స్తున్నాయి. పైకి చూసేందుకు నిజ‌మేనా? ఇంత‌గా ప‌వ‌న్‌ను ఆడిపోసుకుంటున్నారా? అని అనిపించ‌క‌పోదు. కానీ, వాస్త‌వాలు.. జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ప‌వ‌న్ ఏరేంజ్‌లో కీలు బొమ్మ‌గా మారిపోయాడో తెలుస్తుంద‌ని జాతీయ మీడియానే చెబుతోంది. ఇటీవ‌ల తాను నేరుగా చంద్ర‌బాబుతో చేతులు క‌లిపాడు. ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ పేరుతో ఇద్ద‌రూ క‌లిసి ఉద్య‌మించాల‌ని నిర్ణ‌యించారు.

ఇది బాగా జ‌నాల్లోకి వెళ్లింది. ప‌వ‌న్‌కు అంద‌రూ జై కొట్టారు. ఈ వ్య‌వ‌హారం ఇలా సాగుతుండ‌గా.. మంచి ఇమేజ్ ఏదో సొంతం అవుతోంద‌నే అంచ‌నాలు వ‌స్తుండ‌గా.. ప‌వ‌న్ వేసిన అడుగు మొత్తం ఇమేజ్‌ను డ్యామేజీ చేశాయి.

ఢిల్లీలోనిబీజేపీ పెద్ద‌లు `చిటికేస్తే.. ప‌వ‌న్ వ‌స్తాడు!` అనే రీతిలో వెంట‌నే రా! అనే స‌రికి ఆద‌రాబాద‌రాగా ఢిల్లీ వెళ్లిపోయారు. అక్క‌డ ఏం జ‌రిగిందో ఏమో తెలియ‌దు కానీ,(ఎందుకంటే బీజేపీ చెప్ప‌లేదు.,ప‌వ‌న్ చెప్ప‌లేదు. ప‌వ‌న్ అనుకూల మీడియా కూడా చెప్ప‌లేదు) బ‌య‌ట‌కు మాత్రం కొన్ని లీకులు వ‌చ్చాయి.

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో ప‌వ‌న్ భేటీ అయిన ఫొటోలు మీడియా చెంత‌కు చేరాయి. ఇవి తెలుగు మీడియాలో రాలేదు కానీ.. సోష‌ల్ మీడియా లో మాత్రం వైర‌ల్ అయ్యాయి. న‌డ్డా గంభీరంగా కూర్చుంటే.. ఆయ‌న‌ముందు.. చేతులు ముడుచుకుని ప‌వ‌న్ కూర్చున్నారు. ఇక‌, ఏం జ‌రిగిందో అంతా గ్యాసిప్ కావొచ్చు.. లేదా క‌ల్పిత‌మని అనుకోవ‌చ్చు.. న‌డ్డా..ప‌వ‌న్‌కు వార్నింగ్ ఇచ్చార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు.. ఎవ‌రిని అడిగి టీడీపీతో చేతులు క‌లిపారని ఆయ‌న ప్ర‌శ్నించిన‌ట్టు జాతీయ మీడియా ప్ర‌శ్నించింది. మొత్తానికి ఇది ప‌వ‌న్‌కు యాంటీ అయింది.

నిజానికి ప‌వ‌న్ ఆ రోజు చంద్ర‌బాబుతో చేతులు క‌లిపిన‌ప్పుడు చూపించిన పౌరుషంలో ఒక్క పావ‌లా వంతు కూడా ఢిల్లీలో చూపించ‌లేక పోయార‌నేది ప్ర‌ధాన విమ‌ర్శ‌. పైగా.. బీజేపీ కి ఏపీలో ఉన్న ఓటు బ్యాంకుతో పోలిస్తే.. ప‌వ‌న్‌కు నాలుగు రెట్లు ఉంది. బీజేపీకి ఉన్న‌ది 1 నుంచి 2 శాతం అయితే ప‌వ‌న్‌కు 7 శాతం ఉంద‌ని అంటున్నారు. మ‌రి అలాంటి నేత త‌న‌ద‌గ్గ‌ర‌కు బీజేపీ నేత‌ల‌ను ర‌ప్పించుకోవాలి. లేదా.. త‌నే నిర్ణ‌యం తీసుకుని బ‌య‌ట‌కు రావాలి. ప్ర‌జ‌ల‌ను న‌మ్ముకోవాలి. కానీ, ప‌వ‌న్ ఊడిగం చేయ‌నంటూనే కీలు బొమ్మ‌గా మారిపోవ‌డం ఇప్పుడు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.