Begin typing your search above and press return to search.

న‌లుగురు ఎంపీలు.. 20 శాతం ఓట్లు.. తెలంగాణ‌కు పంగ‌నామాలు!

By:  Tupaki Desk   |   4 May 2022 11:30 AM GMT
న‌లుగురు ఎంపీలు.. 20 శాతం ఓట్లు.. తెలంగాణ‌కు పంగ‌నామాలు!
X
2014 ఎన్నిక‌ల్లో దేశంలో నేషన‌ల్ పార్టీ అయిన బీజేపీ సొంత‌గానే గెలిచింది. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్ర‌భుత్వాన్ని ప‌క్క‌న పెట్టి.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. ఆ త‌ర్వాత‌.. ఆయ‌న చూపు, బీజేపీ చూపు కూడా ప్రాంతీయ పార్టీల‌పై ప‌డింది. దీంతో ఆయా పార్టీల‌ను వశం చేసుకునేందుకు.. కుదిరితే విలీనం చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు. బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది..ఏదేదో చేస్తున్నామ‌ని చెప్పి.. చివ‌ర‌కు.. నోట్ల‌ను ర‌ద్దు చేశారు.

ఫ‌లితంగా.. దేశంలో ఆర్థిక వ్య‌వ‌స్థ ఒక్క‌సారిగా కుంగిపోయింది. ఫ‌లితంగా బీజేపీస‌హాప్ర‌ధాని దేశంలో అల్ల‌రి పాలయ్యారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు.. దేశం నుంచి త‌ర‌లి పోయిన న‌ల్ల‌ధనాన్ని వెన‌క్కి తెప్పించి.. ప్ర‌తి ఒక్క‌రి ఖాతాలోనూ.. 20 ల‌క్ష‌లు వేస్తామ‌ని చెప్పి.. ఓట్లు వేయించుకున్నారు. అయితే.. దీనికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క రూపాయి కూడా వేయ‌లేదు. పోనీ.. స‌ద‌రు బ్లాక్ మ‌నీని తీసుకు వ‌చ్చారా? అంటే.. అది కూడా లేదు.

ఇదిలావుంటే.. బీజేపీ హ‌యాంలోనే చాలా మంది కార్పొరేట్ దిగ్గ‌జాలు.. విజ‌య్ మాల్యా, నీర‌వ్ మోదీ, చౌక్సీ వంటివారు.. బ్యాంకుల‌ను లూటీ చేశారు. కానీ, క‌ట్టలేదు. ఈ దోపిడీ.. కాంగ్రెస్ హ‌యాంలోనూ జ‌రిగింది. అయితే.. బీజేపీ టైంలోనే ఎక్కువ‌గా దోచేశారు. ఉదాహ‌ర‌ణ‌కు2014 ఎన్నిక‌ల‌కు ముందు.. గౌతం ఆదారీ.. దేశంలో డ‌బ్బు ఉన్న వ్య‌క్తి అయినా.. ప్ర‌పంచంలో టాప్ 5 కుబేరుడు అయ్యాడు అంటే.. దానికి బీజేపీ కార‌ణం అని చెబుతున్నారు.

ఆయ‌న ప్రొడ‌క్ట్స్ పెద్దగా మార్కెట్ లేకున్నా.. ఎయిర్‌పోర్ట్స్‌, సీ పోర్ట్స్ ఇలా .. చాలా అత‌నికి అప్ప‌గించే స‌రికి అత‌ను ప్ర‌పంచ కుబేరుడు అయిపోయాడు. అదేవిధంగా మొద‌టి నుంచి ముఖేష్ అంబానీ.. రిచ్ అయినా.. 2014 త‌ర్వాత‌.. వాళ్ల ఆస్తి.. 100 రెట్లు పైనే పెరిగింది. అయితే.. ఇప్పుడు చ‌ర్చ అంతా కూడా.. తెలంగాణ‌లో 2019 జ‌న‌ర‌ల్ ఎన్నిక‌ల‌లో ఎవ‌రూ ఊహించ‌ని ఓట్లు బీజేపీ వ‌చ్చాయి. అంతుకముందు.. టీఆర్ ఎస్ ప్ర‌భంజ‌నం సృష్టించింది.

అయితే.. కేవ‌లం 8 ఏళ్ల‌లోనే బీజేపీకి తెలంగాణ‌లో 4 ఎంపీ సీట్లు, 20 శాతం ఓట్లు వ‌చ్చాయి. మాయ మాటలు చెపుతున్నారు కానీ, త‌లంగాణ‌కు ఒక్క రూపాయి కూడా తీసుకు రావ‌డం లేదు. ఒక్క నేష‌న‌ల్ ప్రాజెక్టు కూడా తీసుకురాలేవు. ఈ విష‌యంపై బీజేపీ వారిని అడిగితే.. అన్ని కోట్లు ఇచ్చాము.. ఇన్ని కోట్లు పంచాము అని చెబుతున్నారు త‌ప్ప‌.. ఒక్క ప్రూఫు కూడా చూపించ‌లేక పోతున్నారు. జాతీయ ర‌హ‌దారుల విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. తెలంగాణ నుంచి పోయింద‌నుకోండి. దాని ఖ‌ర్చు ఇచ్చాము.. అంటారు.

వాస్త‌వానికి అది ప్రాజెక్టు ఎలా అవుతుంది? రెండు రాష్ట్రాల‌ను కలుపుతూ.. నిర్మించే ప్రాజెక్టు కూడా తెలంగాణ ఖాతాలో వేస్తున్నారు. ఇది రాష్ట్రానికి కేటాయించిన ప్రాజెక్టు ఎలా అవుతుంది? అంటే.. స‌మాధానం చెప్పే నాథుడు లేరు. ఇక‌, ఈ ర‌హ‌దారుల ద్వారా.. టోల్ గేట్ డ‌బ్బులు వ‌సూలు చేసుకుంటున్నారు. ప్ర‌జ‌లు ఈ డ‌బ్బులు క‌డుతున్నారు క‌దా.. అంటే.. వాళ్ల డ‌బ్బులు వాళ్లే చెబుతారు కానీ.. ఒక్క నేష‌న‌ల్ ప్రాజెక్టును కానీ, కంపెనీని కానీ.. తీసుకువ‌చ్చిన పాపాన పోలేదు.

అంతేకాదు.. నిరుద్యో స‌మ‌స్య‌పై ఏనాడూ.. బీజేపీ నేత‌లు పెద‌వి విప్పింది లేదు. ఇక‌, వెనుక బ‌డిన జిల్లాల అభివృద్ధిని కానీ, వ‌ల‌స‌ల‌ను త‌గ్గించే చ‌ర్య‌లు కానీ. ఒక్క‌టి ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇదే ఇప్పుడు తెలంగాణ‌లో .. ఆ న‌లుగురు ఎంపీల చుట్టూ జ‌రుగుతు న్న ప్ర‌ధాన చ‌ర్చ‌. మ‌రి దీనిపై ఏమంటారో చూడాలి.