Begin typing your search above and press return to search.

టీఆర్ నేత అకృత్యం: భార్య చ‌నిపోయింద‌ని చెప్పి రెండో పెళ్లి.. ఆడ‌పిల్ల పుడుతోంద‌ని అబార్ష‌న్లు

By:  Tupaki Desk   |   29 Aug 2022 9:14 PM IST
టీఆర్ నేత అకృత్యం: భార్య చ‌నిపోయింద‌ని చెప్పి రెండో పెళ్లి.. ఆడ‌పిల్ల పుడుతోంద‌ని అబార్ష‌న్లు
X
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు ఒక‌రు అకృత్యానికి పాల్ప‌డ్డాడు. త‌న భార్య బ‌తికి ఉండ‌గానే చ‌నిపోయింద‌ని అబ‌ద్ధం చెప్పి.. రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక‌, రెండో భార్య గ‌ర్భ‌వ‌తి అని తెలిసి.. టెస్టులు చేయించి.. ఆడ‌పిల్ల క‌డుపులో ఉంద‌ని తెలిసి.. అబార్ష‌న్లు చేయించాడు. ప్ర‌స్తుతంఇది అధికార పార్టీ చుట్టూ రాజ‌కీయ దుమారం రేగేందుకు అవ‌కాశం ఇచ్చిన‌ట్టు అయింది.

ఇంత‌కీ ఎవ‌రు?

యాదాద్రి జిల్లా రామన్నపేటకు చెందిన తెరాస నేత, మాజీ ఎంపీటీసీ ముక్కముల దుర్గయ్య తన మొదటి భార్య చనిపోయిందని చెప్పి.. 2018లో విజయను రెండో వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులు ఆమెను వేరే ఊరిలో కాపురం ఉంచాడు. ఆ తర్వాత విజయ గర్భవతి అని తెలియడంతో దుర్గయ్య ఆమెకు టెస్ట్లు చేయించాడు.

పరీక్షలో ఆడపిల్ల అని నిర్ధారణ కావడంతో రెండుసార్లు అబార్షన్ చేయించాడు. ఈ విషయంపై ఆమె నిలదీయడంతో తన మొదటి భార్య బతికే ఉందని ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని.. కొడుకు కోసమే రెండో పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు.

దీంతో విజయ అతడిపై 2020లో రామన్నపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసును వెనక్కు తీసుకోమని దుర్గయ్య విజయను కోరాడు. మరలా కలిసి ఉందామని ఆమెను నమ్మించాడు. ఈ క్రమంలో విజయ మరోసారి గర్భవతి అయింది. ఫిబ్రవరిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి దుర్గయ్య ఆమెను పట్టించుకోలేదు. ఈ క్రమంలో న్యాయం కోసం స్థానిక పోలీసులను ఆశ్రయించిన వారు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

తాజాగా విజ‌య‌.. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మంత్రి జగదీశ్వర్ రెడ్డి అండదండలు తనకు ఉన్నాయని ఎవ్వరూ ఏమీ చేయలేరని దుర్గ‌య్య‌ బెదిరిస్తున్నాడని ఆమె చెప్పింది. ఇప్పటికైనా తనకు, తన పాపకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజయ కమిషన్ను కోరింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.