వీర్రాజు వార్నింగులు పనిచేస్తాయా ?

Wed Jun 29 2022 12:23:04 GMT+0530 (IST)

news on bjp somu veerraju

ఇప్పటిదాకా బీజేపీ  చెప్పిన మాటలేవీ రాష్ట్ర ప్రజలను నమ్మించేలా లేవు అని తేలిపోయింది.   బీజేపీ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది అన్న విమర్శలూ ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంటు అమ్మకంపై ఓ మాట రాజధాని భూముల అమ్మకం పై మరో మాట వినిపిస్తోంది.స్టీలు ప్లాంటు భూముల అమ్మకం లేదా ఆస్తుల అమ్మకం తరువాత ప్రయివేటీకరణ పై ఏ మాత్రం నోరు విప్పని ఏపీ బీజేపీ రాజధాని భూములపై అపార ప్రేమ కురిపిస్తోందని ఓ విమర్శ వస్తోంది.

రాజధాని భూములు రాజధాని కోసమే అన్న వాదన కోర్టు వినిపించింది కానీ అత్యవసర ఆదాయ వనరుల కోసం ప్రభుత్వం భూములు అమ్మకం చేయక  తప్పడం లేదని వైసీపీ వాదిస్తోంది. రాజధాని రైతులకు అండగా ఇప్పటిదాకా నిలబడిన దాఖలాలే లేని బీజేపీ సడెన్ గా భూములపై మాత్రం మాట్లాడడం ఆశ్చర్యకరంగానే ఉందని మరో వాదన కూడా వినిపిస్తోంది.

ఇంతవరకూ రాజధాని రైతు ఉద్యమంలో నేరుగా అయితే బీజేపీ పాల్గొనలేదు. అదేవిధంగా ఆరోజు భూ సేకరణలో కొన్ని వివాదాలున్నా కూడా అప్పుడూ మాట్లాడ లేదు. నిర్మాణాత్మక విపక్ష వైఖరి ఏనాడూ ప్రదర్శించలేదు.

అయితే భూముల అమ్మకంపై ఇప్పుడు ఎందుకు నోరు మెదుపుతున్నారని ? రాజధాని భూములు అమ్మితే తప్పు అని అంటే విశాఖ స్టీలు ప్లాంటు భూములు అమ్మకం కూడా తప్పే ! అన్న వాదన కూడా వస్తోంది.

ప్రభుత్వం భూములు సేకరించి నిర్మాణాలు చేపట్టాలి. కానీ సేకరించిన భూములు అమ్మడం తప్పు అని బీజేపీ అంటోంది బాగుంది.. ప్రభుత్వం ఎన్నోఏళ్లుగా తన పరిధిలో తన నేతృత్వంలో ఉన్న ఆస్తులు ఏ విధంగా చెప్పాపెట్టకుండా అమ్మేస్తుందని? దీనిని ఎవ్వరైనా అడ్డుకుంటున్నారా అని సామాజిక కార్యకర్తలు సైతం అడుగుతున్నారు. ప్రశ్నిస్తున్నారు. వైసీపీది తప్పు అయితే బీజేపీది కూడా తప్పే ! లేదు వైసీపీని రాజకీయంగా నిలువరించేందుకు బీజేపీ మాట్లాడితే ఇక ఆ వాదనలో సహేతుకత ఎందన్నది సోము వీర్రాజే చెప్పాలి అని కూడా అంటున్నారు  సామాజిక కార్యకర్తలు.