Begin typing your search above and press return to search.
మూడు జిల్లాలలో మూడుతుందా... ఐప్యాక్ సర్వే ఏం చెప్పింది...?
By: Tupaki Desk | 6 Nov 2022 8:00 AM ISTఎన్నికలు ఏణ్ణర్ధంలో ఉన్నాయనగానే అధికార వైసీపీకి షాకింగ్ న్యూసులు వరసబెట్టి వస్తున్నాయి. అంతా బాగుంది అని ఎంత పైకి అనుకున్నా సమీక్షలలో ఎంతలా జోష్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నా వస్తున్న సర్వేలు మాత్రం తెగ కలవరపెడుతున్నాయి. అలాంటిదే ఒక సర్వే ఇపుడు వైసీపీ పెద్దలకు నిద్రపట్టనీయడంలేదని చెబుతున్నారు.
ఇంతకీ ఆ సర్వే ఏమిటి దాని కమామీష్ ఏంటి అన్నది కనుక చూస్తే చాలా మ్యాటరే ఉంది. అమరావతిని ఆనుకుని ఉన్న జిల్లాలలో వైసీపీకి మూడు చోట్ల గట్టి దెబ్బ తగులుతుందని ఐప్యాక్ సర్వేలో తేలుతున్న విషయమట. ఆ సర్వే ప్రకారం చూస్తే క్రిష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి గెలుపు గండం ఉందని అంటున్నారు.
ఈ ఎమ్మెల్యేల వ్యవహార శైలి వల్ల పార్టీకి భారీ నష్టం తప్పదని సర్వే హెచ్చరిస్తోంది. వీరి వల్ల ఆయా నియోజకవర్గాలలో పార్టీ దారుణంగా దెబ్బ తింటోందని కూడా చెబుతున్నారు. చిత్రమేంటి అంటే వైసీపీకి చెందిన వారే ఐ ప్యాక్ సర్వే టీం కి ఎమ్మెల్యే తీరు మీద యాంటీగా ఫీడ్ బ్యాక్ ఇవ్వడం.
ఈ ఫీడ్ బ్యాక్ తో పాటు జనంలో నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరిస్తే డేంజర్ బెల్స్ ఈ మూడు కీలక జిల్లాలలో వైసీపీకి మోగుతున్నాయనే అంటున్నారు. దీనికంటే ముందే ఈ ఎమ్మెల్యేలకు అధినాయకత్వం గట్టిగానే చెబుతూ వచ్చింది. పార్టీ ఆదేశించిన విధంగా గడప గడపకు కార్యక్రమంలో పాలుపంచుకోవాలని, జనంలో ఉండాలని నష్ట నివారణ చేసుకోవాలని కోరింది.
అయినా కూడా చాలా మంది ఎమ్మెల్యేలు మాత్రం తమ పనితీరు మార్చుకోవడంలేదు అని అంటున్నారు. దాని ఫలితమే ఇపుడు ఐ ప్యాక్ టీం కి చేదు నిజాలు అందాయని అంటున్నారు. ఇక చివరి ప్రయత్నాలు కూడా విఫలం అయితే మాత్రం వైసీపీ అధినాయకత్వం ఎక్కడ ఎమ్మెల్యేల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందో వారిని తప్పించి అక్కడ కొత్తవారిని దించేందుకు సిద్ధమవుతుంది అని అంటున్నారు.
మొత్తానికి చూస్తే 2019 ఎన్నికల్లో ఐ ప్యాక్ టీం వైసీపీ విజయానికి ఏ విధంగా శ్రమించిందో ఇపుడు కూడా నియోజకవర్గానికి ఇరవై మంది కార్యకర్తలను ఎంపిక చేసి వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటోంది. అలావచ్చిన సమాచారం చూస్తే కనుక ఎమ్మెల్యేలు చాలా మంది ఇక ఇంటికేనా అన్న చర్చ అయితే మొదలైంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.