Begin typing your search above and press return to search.

వైఎస్ సానుభూతికి గండి.. హీటెక్కిన సీనియ‌ర్ల రాజ‌కీయం

By:  Tupaki Desk   |   6 Jan 2023 10:00 PM IST
వైఎస్ సానుభూతికి గండి.. హీటెక్కిన సీనియ‌ర్ల రాజ‌కీయం
X
ఎంత లేద‌న్నా.. ఏపీలో అధికార పార్టీ వైసీపీకి దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సానుభూతి ఓటు బ్యాంకు అవ‌స‌రం. ఎన్నిప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నా.. ఎంత సంక్షేమం ఇస్తున్నా.. ఎన్నిక‌ల‌స‌మ‌యం వ‌చ్చే స‌రికి ఖ‌చ్చితంగా సెంటిమెంటు రాజ‌కీయాల‌కు వైసీపీ తెర‌దీయ‌డం ఖాయం. గ‌త ఎన్నిక‌ల్లోనూ వైఎస్ ఇమేజ్ ను వాడుకున్నారు. ఒక‌వైపు జ‌గ‌న్ పాద‌యాత్ర చేశారు. అదేస‌మ‌యంలో అనేక నినాదాలు ఇచ్చారు.

అయిన‌ప్ప‌టికీ మ‌రోవైపు మాత్రం.. వైఎస్ జెండాను, అజెండాను వాడుకున్నారు. రాజ‌న్న రాజ్యం అంటూ.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. ఇలా.. ఏదొక సెంటిమెంటును మాత్రం వైసీపీ ఖ‌చ్చితంగా న‌మ్ముకుంటోంది. ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ వైఎస్ బొమ్మ‌ను వాడుకునేలా ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌ను రెడీ చేసుకుంటున్నారు. అయి తే.. ఇదే విష‌యాన్ని కొంద‌రు సీనియ‌ర్లు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా ఇట‌వ ల కాలంలో అస‌మ్మ‌తి గ‌ళాలు వినిపిస్తున్న‌వారు.. వైఎస్‌ను కేంద్రంగా చేసుకుంటున్నారు.

ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి, మేక‌తోటి సుచ‌రిత‌.. ఇలా ప‌లువురు నాయ‌కులు ఇటీవ‌ల కాలంలో అస‌మ్మ‌తి గ‌ళాన్ని జోరుగానే వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. వీరి వ్యాఖ్యల‌ను గ‌మ‌నిస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైఎస్‌ను వైసీపీకి దూరం చేసే వాద‌న వినిపిస్తోంది. వైఎస్ హ‌యాంలో ఇలా లేదు! అని ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది.. చాలా తీవ్ర‌మైన వ్యాఖ్య‌. ప్ర‌స్తుతం రాజ‌న్న రాజ్యం అందిస్తున్నామ‌ని ఒక‌వైపు జ‌గ‌న్ చెబుతున్నారు.

దీనికి భిన్నంగా ఆయ‌న వ్యాఖ్యానించారు. అదేవిధంగా సుచ‌రిత కూడా.. నేను వైఎస్ కుటుంబానికి అను కూల‌మే.. కానీ, ఎప్పుడూ అలానే ఉండిపోవాల‌ని లేదుగా! అని అన్నారు. ఇక‌, శ్రీధ‌ర్‌రెడ్డి.. వైఎస్ హ‌యాం లో రాజ‌కీయాలు వేరు అని వ్యాఖ్యానించారు. అంటే.. మొత్తంగా వీరి వాద‌న చూస్తే.. వైఎస్ కేంద్రంగా ఏదో జ‌రుగుతోంద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి చివ‌ర‌కు ఏమ‌వుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.