Begin typing your search above and press return to search.
జగన్ కి శ్రమ ఇవ్వకుండానే వెళ్ళిపోతారా...?
By: Tupaki Desk | 13 Jan 2023 8:00 AM ISTవైసీపీలో ఇపుడు ఒక చర్చ సాగుతోంది. పార్టీలో అసంతృప్తి ఏ స్థాయిలో ఉంది అన్నదే ఆ చర్చ. ఎవరికీ అది అంతుపట్టడంలేదు. అది ఒక వింతైన అనుభవం. వైసీపీ పెట్టాక చిన్నా చితకా విభేదాలు వచ్చి నాయకులు అయటకు వెళ్ళిన సందర్భాలు ఉనాయి. ఇపుడు పార్టీ అధికారంలో ఉంది. మరో పదిహేను నెలల పవర్ కూడా చేతిలో ఉంది.
అయినా సరే ఇప్పటి నుంచే ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి అంటే దానికి అధినాయకత్వం అనుసరిస్తున్న వైఖరి కారణం అని అంటున్నారు. గత ఏడాది నుంచి పార్టీ ఎమ్మెల్యేలు జనంలోకి పంపించడం ద్వారా ఎన్నికల మూడ్ ని రగిలించింది వైసీపీ హై కమాండే అంటున్నారు. అంతే కాకుండా పనితీరు మీద సర్వేల మీద సర్వేలు చేసి హడలుకొట్టిందని అంటున్నారు.
ఇక ఎన్నికలకు కాస్తా ముందుగా ఏ అధికార పార్టీలో అయినా టికెట్ల గోల ఉటుంది. ఈ విషయంలో విపక్షాలు ముందు సర్దుకుంటాయి. కానీ ఆది ముందే అధికార పార్టీ హైరానా పడడం వల్ల ఇపుడు అసలు సమస్యలు వస్తున్నాయని అంటున్నారు వర్క్ షాప్స్ పెట్టి మరీ టికెట్లు రావు అన్నట్లుగా చెప్పడం, దాని మీద ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగడంతో ఎవరికి వారే భయపడుతున్న పరిస్థితి ఉంది.
రాజకీయాలో అధినేతలకు ఒక అజెండా ఉంటే ఎమ్మెల్యేలకు కూడా ఎవరికి వారిది ఉంటుంది. ఎవరూ అయిదేళ్ల పాటు ఖాళీగా ఉండాలనుకోరు కదా. ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ అని భావిస్తారు. అంతే కాదు తమ అవకాశాలు తాము వెతుక్కుంటారు. అంతేకానీ పనితీరు బాలేదు పక్కన ఉండండి అంటే ఉండరు కదా. అందుకే అధికార పార్టీలో ఉన్న వారు ఆచి తూచి వ్యవహరించాలి.
మరి ఎందుకో తొందరపడింది వైసీపీ అధినాయకత్వం. దాంతో బిలబిలమంటూ అసమ్మతి నాయకులు ఒక్కొకరుగా బయటకు వస్తున్నారు. నెల్లూరు జిల్లాలో అపుడే ముగ్గురు ఎమ్మెల్యేలు అసమ్మతి రాగాలు ఆలపిస్తున్నారు. ఆనం రామనారాయణరెడ్డి బయటపడిపోయారు. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి బయటపడి సీఎం జగన్ తో భేటీ తరువాత తగ్గినట్లుగా అనిపించినా ఆయన ఇంకా చల్లారలేదని అంటున్నారు.
నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకా ఇదే జిల్లాలో మరి కొందరు గొంతు సవరిస్తారు అని అంటున్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో కూడా అసంతృప్తి నేతలు ఉన్నారని అంటున్నారు. ఆ మధ్యన దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రభుత్వ తీరు మీద కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడపలో చూస్తే రాజం పేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జునరెడ్డి వైఖరి అనుమానాస్పదంగా ఉంది.
అలాగే ఇదే జిల్లాలో మరో ఇద్దరు ముగ్గురు కూడా గొంతు పెంచడానికి చూస్తున్నారు అని అంటున్నారు. ఇక అనంతపురంలో కూడా ఎమ్మెల్యేలు కొందరు టికెట్ రాదు అన్న డౌట్ ఉన్నవారు అసహనంతో ఉన్నారని టాక్. ఈ సెగ కోస్తా జిల్లాలకు కూడా తాకుతోంది. క్రిష్ణా జిల్లాకు చెందిన వసంత క్రిష్ణ ప్రసాద్ అయితే బాహాటం అయిపోయారు. మాట్లాడితే పోయేదేమీ లేదు అన్న తరహాలో ఆయన వ్యవహారం ఉంది అంటున్నారు.
మరో వైపు చూస్తే ఉత్తరాంధ్రాలో భీమిలీకి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కూడా తరచూ అసహనానికి లోను అవుతున్నారు. అలాగే టికెట్ రాదు కుదరదు అన్న సంకేతాలు ఉన్న వారు అంతా కూడా సైలెంట్ అవుతున్నారు. ఒక విధంగా మరో ఏడాదికి పైగా ప్రభుత్వం నడపాల్సి ఉంది. ఇలా సొంత పార్టీ వారే రివర్స్ అయితే వైసీపీకి సర్కార్ కి అది కష్టమే కాకుండా బిగ్ ట్రబుల్స్ ని క్రియేట్ చేస్తుంది అని అంటున్నారు.
నెలలు గడుస్తున్న కొద్దీ ఈ అసమ్మతి కానీ లేచే గొంతులు కానీ తగ్గేది లేదు సరికదా పెరుగుతూనే ఉంటాయని అంటున్నారు. దానికి కారణం అభద్రతాభావంతో పాటు ముందే బయటపడితే వేరే చోట ప్రయత్నం చేసుకోవచ్చు అన్న ముందు చూపు అని అంటున్నారు. సో కొత్త ఏడాది అంతా ఈ రకమైన సెగలూ పొగలూ వైసీపీ పెద్దలు భరించాల్సిందే అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.