Begin typing your search above and press return to search.
ఇలా చేసి జగన్ ఏం సందేశం పంపుతున్నారు.. వైసీపీలో హాట్ టాపిక్...!
By: Tupaki Desk | 21 Oct 2022 10:00 PM ISTఏపీ అధికార పార్టీ వైసీపీలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఆ పార్టీ నేతలు కలవరం చెందుతున్నారు. టికెట్లు ఆశించిన వారిని పక్కన పెడుతుండ డం.. కనీసం.. వారి గోడును కూడా వినిపించుకోవడం.. ఇప్పుడు చర్చకు వస్తోంది. ఎందుకంటే.. గత వారంలో ఒకరు.. తాజాగా మరొకరు.. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు.
వీరు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్నవారే కావడం గమనార్హం. నిజానికి పార్టీలో ఉన్న చాలా మంది సీనియర్లు టికెట్లు ఆశిస్తున్నా రు. ఇది సహజం కూడా. రాజకీయాల్లోకి వచ్చేది పదవుల కోసమే. అయితే.. కొన్ని కొన్ని సందర్భాల్లో అందరి కోరికలు తీరేలా కనిపించడంలేదు.
సో.. ఇలాంటి సమయంలో వారిని నయానో.. భయానో.. నచ్చజెప్పుకోవాలి. అంతేకానీ.. పార్టీ నుంచి ఏకంగా.. పక్కన పెట్టేసి.. ఎలాంటి సంకేతాలు ఇస్తున్నట్టు? అనేది వైసీపీలో జరుగుతున్న చర్చ. ఎందుకంటే.. టికెట్లు ఆశించిన వారందరినీ.. పక్కన పెట్టేస్తూ.. సస్పెండ్ చేసేస్తూ.. పోతే.. ఇక, మిగిలేది ఎవరు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రస్తుతం కర్నూలు, అనంతపురం, ఉత్తరాంధ్ర వంటి జిల్లాల్లో.. ఒక్కొక్క నియోజకవర్గంలో ఇద్దరు చొప్పున వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారు. పాలన బాగుండడం కావొచ్చు.. లేదా.. సంక్షేమ పథకాలు తిరిగి.. వైసీపీని గద్దెనెక్కిస్తాయనే భావన కావొచ్చు.
ఎలా చూసుకున్నా.. ఈ నాయకులు.. మాత్రం.. టికెట్ కోసం పట్టుబడుతున్నారు. మరి ఇలాంటివారిని వదిలించేసుకుంటే.. పార్టీ బలహీన పడడం ఖాయమని సీనియర్లు చెబుతున్నారు. పోనీ.. పార్టీపై ప్రభావం ఎలా ఉన్నా.. అక్కడి వైసీపీ నాయకులపై అయినా.. ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. రెబల్స్ పెరిగి.. పోటీలోకి దిగితే.. ఓటు చీలి పోయే ప్రమాదం ఉందని.. హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చాలా మందికి నామినేటెడ్ కోటాలో ఏదొ ఒక పదవి ఇచ్చి సంతృప్తి పరిచినట్టుగానే ఇప్పుడు వీరిని కూడా.. బుజ్జగించేలా వ్యవహరిస్తే.. మంచిదనే సూచనలు వస్తున్నాయి.
పోయి పోయి.. రెబల్స్‌ను పెంచుకోవడం ఎందుకనేది వీరి భావన. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో ఫైట్ మామూలుగా ఉండదని.. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరితోనూ.. పార్టీకి పని ఉంటుందని చెబుతున్నారు. సో.. ఏ ఒక్కరిని కాదన్నా.. ప్రత్యర్థులకు బలం ఇచ్చినట్టేనని అంటున్నారు. మరి జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.