Begin typing your search above and press return to search.
లెక్క తేలిపోయిందా...36 మందికి డౌటేనా ..?
By: Tupaki Desk | 10 Dec 2022 8:00 PM ISTఏపీలో అధికార వైసీపీ వైనాట్ 175 అంటూ ముందుకు సాగుతోంది. అన్ని సీట్లూ మనకే దక్కాలని జగన్ అంటున్నారు. పార్టీ ఫస్ట్ లీడర్ నెక్స్ట్ అని ఆయన చెప్పుకొస్తున్నారు. గత ఆరు నెలలుగా పార్టీ మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా గడప గడపకు ఎమ్మెల్యేలను పంపించి ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్నారు.
ప్రభుత్వ సర్వేలు ఐప్యాక్ టీం తో పాటు అనేక ఇతర సర్వేలను కూడా దగ్గర పెట్టుకుని వైసీపీ హై కమాండ్ మైక్రో లెవెల్ లో చేస్తున్న ఈ అధ్యయనాలలో పార్టీ ఎమ్మెల్యేలు పనితీరు ప్రధాన చర్చగా ఉంది. పనిచేయని వారికి వ్యతిరేకత జనాల్లో ఉన్న వారికి టికెట్ దక్కదు అని ముందే జగన్ చెప్పేశారు. టికెట్ వస్తే మీ పనితీరు వల్లనే రాకపోతే మాత్రం అది కూడా మీ వల్లనే అని ఆయన గతంలోనే చెప్పేశారు.
దాంతో ఈ నెల 14న చివరి సారిగా నిర్వహిస్తున్న వర్క్ షాప్ మీద అందరి చూపూ ఉంది. ఈ వర్క్ షాప్ లో లెక్కలు మొత్తం తేలిపోతాయని అంటున్నారు. ప్రజల వద్ద రెడ్ మార్క్ పడిన ఎమ్మెల్యేల జాబితా అధినాయకత్వం వద్ద ఉంది అని అంటున్నారు. దాంతో వారికి టికెట్లు డౌట్లో పడినట్లే అని చెబుతున్నారు. ఈ నంబర్ చూస్తే 36 మంది దాకా ఉంది అని తెలుస్తోంది.
గతంలో నిర్వహించిన వర్క్ షాప్ లో 27 మంది ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉందని వివరాలు బయటకు వచ్చాయి. ఇపుదు ఆ సంఖ్య మరింత పెరిగింది అని అంటున్నారు. ఇందుఇలో మాజీ మంత్రులు ప్రస్తుత మంత్రులు కూడా ఉన్నారని ప్రచారం సాగుతోంది. మరి ఈ నంబర్ ని దృష్టిలో పెట్టుకుంటే వీరికి టికెట్లు ఇవ్వమని చెప్పేస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది.
మరో వైపు చూస్తే మొత్తం వైసీపీ తరఫున గెలిచిన 22 మంది లోక్ సభ సభ్యులలో సగానికి సగం అంటే 11 ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించాలని హై కమాండ్ డిసైడ్ అయింది అంటున్నారు. మరో వైపు పది మంది దాకా ఎమ్మెల్యేల వారసులకు టికెట్లు ఇస్తారని తెల్సుతోంది. ఇవన్నీ కూడా కలిపితే ఒక అరవై మంది దాకా ప్రస్తుత ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కవనే అంటున్నారు.
ఆ విషయాన్ని వర్క్ షాప్ లో సూచనాప్రాయంగా చెబుతారా అన్నదే చూడాలని అంటున్నారు, ఇప్పటికి మూడు సార్లు హెచ్చరించిన నేపధ్యంలో మరో చాన్స్ ఇవ్వబోరు అన్న మాట కూడా వినిపిస్తోంది. దాంతో ఎమ్మెల్యేల గుండెలు పీచ్ పీచ్ మని కొట్టుకుంటున్నాయి. వర్క్ షాప్ లో జగన్ ఏ విషయాలను చెబుతారో ఎవరి ప్రోగ్రెస్ రిపోర్టులో ఏముందో అన్న కంగారు అయితే అందరిలో ఉంది.
అయితే పార్టీ కచ్చితంగా గెలవాలని పట్టుదలతో ఉన్న హై కమాండ్ ఎవరి విషయంలోనూ రాజీ పడే ప్రసక్తే లేదని అంటున్నారు. జగన్ గట్స్ ఏంటి అన్నవి మంత్రులను ఆరు నెలల క్రితం మార్చేసినపుడే అంతా చూశారని చెబుతున్నారు. అందువల్ల సర్వే నివేదికలను అన్నింటినీ క్రోడీకరించుకుని వైసీపీ హై కమాండ్ తనకు నచ్చిన తీరున నిర్ణయం తీసుకుంటుంది అని చెబుతున్నారు. మరి ఈ నిర్ణయం ఎంతమందికి చేదుని మిగిలిస్తుందో చూడాలి
ఏది ఏమైనా లాస్ట్ చాన్స్ అన్నది మాత్రం ఉండదని ఈసారి టికెట్లు దక్కని వారి వివరాలు బయట పెట్టడమో లేక వారికే తెలియచేయడమో చేస్తారని ఆ విధంగా అక్కడ కొంత వారిని ముందే రెడీ చేసుకుని పెట్టుకునేలా రంగం సిద్ధం చేస్తారని అంటున్నారు. దీనిని బట్టి చూస్తే ఈ నెల 14న వర్క్ షాప్ సంచలనంగానే మారుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.