Begin typing your search above and press return to search.

మంత్రుల నోటి దూల‌.. మోసం చేసిందిగా..!

By:  Tupaki Desk   |   16 July 2022 1:30 AM GMT
మంత్రుల నోటి దూల‌.. మోసం చేసిందిగా..!
X
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ నాయ‌కులు త‌ర‌చుగా చేస్తున్న వ్యాఖ్య‌లు .. ఆ పార్టీకి.. ప్ర‌భుత్వానికి కూడా ఇబ్బందిగాను.. అంత‌కు మించిన త‌ల‌నొప్పిగాను ప‌రిణ‌మించింద‌నే వాద‌న వినిపిస్తోంది. నాయ‌కు లు ఏం మాట్లాడినా.. పార్టీకి ప్ర‌యోజ‌నం క‌లిగించేలా.. ప్ర‌భుత్వానికి ప్ల‌స్ అయ్యేలా వ్య‌వ‌హ‌రించాలి. గ‌తం లో ఉన్న ప్ర‌భుత్వాల్లో ఇలానే నాయ‌కులు వ్య‌వ‌హ‌రించేవారు. ఎవ‌రైనా ఒక‌రిద్ద‌రు నోరు చేసుకున్నా.. వెంట‌నే వారిని స‌రిదిద్దేవారు. కానీ, వైసీపీలో ఇలాంటి ప‌ద్ధ‌తి లేకుండా పోయింది.

అధినేత మెప్పుకోస‌మో.. లేక‌.. త‌మ‌ను తాము పెద్ద‌గా ఊహించుకునో.. నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లు పార్టీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ఫ‌లితంగా ప్ర‌భుత్వానికి చెడ్డ పేరుతో పాటు.. పార్టీకి సంకెళ్లు వేసిన‌ట్టు అవుతుంద‌ని అంటున్నారు.

తాజాగా వ‌లంటీర్ల విష‌యంలో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం తీసుకున్న నిర్ణ‌యం.. వైసీపీలో క‌ల‌క‌లం రేపింది. ఎన్నిక‌ల విధుల‌కు వ‌లంటీర్ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ వినియోగించ‌రాద‌ని.. రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

ఇది వైసీపీకి పెద్ద‌దెబ్బ‌గానే భావించాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి కార‌ణం.. కేవ‌లం మంత్రులే నని అంటున్నారు. వాస్త‌వానికి వైసీపీ ప్ర‌భుత్వం రావ‌డంతోనేవలంటీర్ వ్య‌వ‌స్థ అందుబాటులోకి వ‌చ్చిం ది. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 ల‌క్ష‌ల మందికి పైగా వ‌లంటీర్లు.. సేవ‌లు అందిస్తున్నారు. ప్ర‌భుత్వానికి క‌ళ్లు చెవులుగా ప‌నిచేస్తున్నార‌నే వాద‌న కూడా ఉంది. ఏ ప‌ని అయినా.. వారికే అప్ప‌గిస్తున్నారు.ఈ క్ర‌మంలో ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. వారినే వినియోగిస్తున్నారు.

అయితే.. వారుప్ర‌భుత్వానికి వ‌లంటీర్ల‌ని.. ఆది నుంచి చెప్పుకొచ్చారు.కానీ, ఇటీవ‌ల కాలంలో మంత్రులు వారిని పార్టీకి అనుబంధంగా తేల్చి చెబుతున్నారు. తానేటి వ‌నిత‌, జోగి ర‌మేష్‌, అంబ‌టి రాంబాబు, ఏకం గా.. ముఖ్య‌మంత్రి సైతం .. ఇటీవ‌ల కాలంలో వైసీపీ నేత‌ల పిల్ల‌ల‌కే వ‌లంటీర్ ఉద్యోగాలు ఇచ్చామ‌ని.. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కే.. వాటిని కేటాయించామ‌ని చెప్పుకొచ్చారు.

అంతేకాదు.. కార్య‌క‌ర్త‌ల‌కు మేలు చేస్తున్నామ‌ని చెప్పుకొచ్చారు. ఈ ప‌రిణామ‌మే.. ఇప్పుడు పెద్ద ఇబ్బందిగా మారి.. ఏకంగా వ‌లంటీర్ల‌ను ఎన్నిక‌ల విధుల్లో జోక్యం చేసుకోవ‌ద్ద‌ని చెప్ప‌డం వ‌ర‌కు వ‌చ్చేసింది. దీనిపై పెద్ద ఎత్తున వైసీపీలో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.