Begin typing your search above and press return to search.

అదానీ గ్రూప్ వార్తల్లో నిజమెంత? ఆ జర్నలిస్ట్ ట్రెండింగ్?

By:  Tupaki Desk   |   14 Jun 2021 1:30 PM GMT
అదానీ గ్రూప్ వార్తల్లో నిజమెంత? ఆ జర్నలిస్ట్ ట్రెండింగ్?
X
కరోనా కల్లోలం ప్రపంచ కుబేరులను సైతం ఆశ్చర్యపరుస్తూ దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతం అదానీ భారీగా సంపాదించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. అయితే తాజాగా అదానీ సంపద 73వేల కోట్లు నష్టపోయిందని.. షేర్లు కుప్పకూలాయన్న వార్తలు పెద్ద ఎత్తున మీడియాలో వచ్చాయి. దీనిపై అదానీ గ్రూప్ స్పందించింది.

అదానీ గ్రూపులో పెట్టుబడి పెట్టిన అల్ బులా ఇన్వెస్ట్ మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ ల ఖాతాలను ఎన్ఎస్డీఎల్ జప్తు చేసినట్లు వచ్చిన వార్తలను అదానీ గ్రూప్ ఖండించింది. ఈ మూడు ఫండ్స్ అదానీ గ్రూప్ లో పెట్టుబడులు పెట్టాయని.. వీటిని ఫ్రీజ్ చేసినట్లు వచ్చిన వార్తలపై తమ రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ ఫర్ ఏజెంట్ ను వివరణ కోరగా అలాంటిదేమీ లేదని తమకు సమాచారం అందిందని అదానీ గ్రూప్ తెలిపింది.

పత్రికలలో వచ్చిన వార్తల వల్ల తమ కంపెనీలోని మైనారిటీ షేర్ హోల్డర్లు భారీ మొత్తంలో నష్టపోయారని కంపెనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రజల కోసం మైనారిటీ షేర్ హోల్డర్ల కోసం బహిరంగ లేఖలను విడుదల చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.

- అదానీ షేర్ల పతనంలో ప్రముఖ జర్నలిస్ట్ ట్రెండింగ్ రూ.43500 కోట్ల పెట్టుబడి పెట్టిన మూడు విదేశీ పెట్టుబడిదారుల ఖాతాలను ఎన్.ఎస్.డీఎల్ జప్తు చేసినట్లుగా వచ్చిన వార్తలతో స్టాక్ మార్కెట్ షేక్ అయ్యింది. దీంతో నిన్నటిదాకా హాట్ కేకుల్లో ఉన్న అదానీ గ్రూప్ షేర్లను కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. షేర్లు భారీగా పతనం అయ్యి దాదాపు 43-73వేల కోట్ల నష్టం వాటిల్లినట్టు వార్తలు వచ్చాయి. అయితే అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు భారీగా పతనం అవ్వడానికి కారణం ప్రముఖ జర్నలిస్ట్ సుచేతా దలాల్ అంటూ ట్విట్టర్ లో ప్రచారం జోరుగా సాగుతోంది. సుచేతా జూన్ 12న రెండు రోజుల క్రితం చేసిన ట్వీట్ ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది.

సుచేతా ట్వీట్ చేస్తూ 'ఓకంపెనీకి చెందిన షేర్ వ్యాల్యూను రిగ్గింగ్ చేస్తూ వస్తోంది. సెబీ ట్రాకింగ్ సిస్టంలతో లభ్యమయ్యే ఈ సమాచారంతో ఆ కంపెనీ చేసిన కుంభకోణాన్ని వెలికి తీసి నిరూపించడం కష్టమని తెలిపింది’ అంటూ పేర్కొంది. నెటిజన్లు ఈ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.