Begin typing your search above and press return to search.

ఆకులు.. వక్కలు.. పక్కలు.. ఇదే గా నీ బతుకు...

By:  Tupaki Desk   |   16 April 2022 5:00 PM IST
ఆకులు.. వక్కలు.. పక్కలు.. ఇదే గా నీ బతుకు...
X
కులాల కుంపట్లతో మొదలైన చిచ్చు వైసీపీ సీనియర్ ఎంపీ విజయసాయిరెడ్డి, నటుడు/నిర్మాత బండ్ల గణేష్ మధ్య వ్యక్తిగత దూషణగా మారింది. కులాలపై మాట్లాడిన విజయసాయిరెడ్డిపై వరుసగా ఓ పది వరకూ ట్వీట్లతో బండ్ల గణేష్ కడిగేశాడు. తీవ్ర పదజాలంతో దూషించాడు. ఈ వివాదం ఇక్కడితో సమసిపోయిందనుకుంటే పొరపాటే..

ఈసారి విజయసాయిరెడ్డి అందుకున్నాడు. బండ్ల గణేష్ పై అంతే తీవ్రంగా విరుచుకుపడ్డాడు. తాజాగా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశాడు. ‘ఆకులు..వక్కలు..పక్కలు...ఇదేగా నీ బతుకు! అంతే ఈజీ అనుకున్నావా ఎవరిని పడితే వాళ్లను కరవడం? ఎవడో ఉస్కో అనగానే పిచ్చి పట్టిన వీధి కుక్కలా ఎగిరెగిరి మొరుగుతున్నావ్. మొరిగి మొరిగి సొమ్మసిల్లినా ఓడలు బండ్లవుతాయి గానీ, బండ్లు ఓడలు కావు. అయ్యో...గణేశా!’’ అంటూ ప్రాసలతో సహా బండ్ల గణేష్ ను కడిగిపారేశాడు విజయసాయి..

అయితే బండ్ల గణేష్ దీనికి ఊరుకోలేదు. మరోసారి ట్వీట్ వార్ కు దిగాడు. విజయసాయిరెడ్డి తనను కుక్కతో పోల్చడంపై బండ్ల గణేష్ తాజాగా సమాధానం ఇచ్చాడు.. ‘ఎస్.. నేను కుక్కనే.. కానీ దానిలా విశ్వాసం ఉన్నవాడిని.. నీలా పిచ్చి కుక్కను కాదు తెలుసుకో దొంగసాయి.. మేము ఏం చేసుకున్నా మా సొంతానికి చేసుకున్నాం.. కష్టపడ్డాం.. నీలా దోచుకోలేదు. దొంగ సొమ్ము దాచుకోలేదు..జగన్ గారు మీ వెనుకాల లేకపోతే నీ బ్రతుకేంటో తెలుస్తోంది’ అని ట్వీట్లు చేశారు.

ఇలా బూతులు, అసహ్య పదాలతో బండ్ల, విజయసాయిరెడ్డి ఒకరినొకరు బజారు కీడ్చుకునేలా రచ్చ చేశారు.కౌంటర్లు ఎన్ కౌంటర్లతో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది ఇక్కడితో ఆగుతుందా? లేదా మరింతగా రెచ్చిపోతారా? అన్నది వేచిచూడాలి.