Begin typing your search above and press return to search.
ఏమిటీ డెల్మిక్రాన్? నిజంగానే అంత డేంజరా?
By: Tupaki Desk | 25 Dec 2021 12:00 PM ISTభయానికి మించిన దారుణమైన రోగం మరొకటి ఉండదు. అంతేకాదు.. ఏదైనా విషయంలో ఒకసారి భయపడటం మొదలైతే చాలు.. అదే పనిగా భయపెట్టే తీరు కొందరిలో కనిపిస్తూ ఉంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కుటుంబం కారణంగా.. తరచూ ఏదో ఒక బూచిని చూపించి భయపెట్టటం కొందరు పనిగా పెట్టుకున్నారా? అన్న సందేహం ఇప్పుడు వ్యక్తమవుతోంది.
ఈ వాదన నిజం అనిపించేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రాణాలు తీసే వేరియంట్ డెల్లాను అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ గా పేర్కొనటంలో అర్థం ఉంది. వేగంగా విస్తరించే గుణాన్ని చూపించి.. ప్రాణాలు తీసే అవకాశం చాలా తక్కువగా ఉన్న ఒమిక్రాన్ ను బూచిగా చూపించటంలో అర్థమేంటి? అన్నది ఎంత ఆలోచించినా అర్థం కానిది.
ఇప్పటికే ఒమిక్రాన్ భయం అంతకంతకూ పెరగటమే కాదు.. ఇప్పుడో రచ్చగా మారి.. కొందరు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా లాక్ డౌన్ పెట్టుకునే వరకు వెళ్లటం.. మరికొందరు పాత నియంత్రణల్ని కొత్తగా అమలు చేయటం చూస్తున్నాం. ఒమిక్రాన్ భయం సరిపోదన్నట్లు తాజాగా ‘‘డెల్మిక్రాన్’’ పేరుతో వణికించటం మొదలు పెట్టారు. చిత్రమైన పేరు సింఫుల్ గా చెప్పాలంటే.. డెల్టా వేరియంట్ ప్లస్ ఒమిక్రాన్ కలిపి.. డెల్మిక్రాన్ గా అభివర్ణిస్తున్నారు. గడిచిన రెండు.. మూడు రోజులుగా ఈ పదాన్ని వినియోగించటం ఎక్కువైంది.
అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు మీడియాలోనూ ఈ వేరియంట్ గురించిన వార్తలు కనిపిస్తున్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం డెల్టా వేరియంట్ తగ్గుముఖం పట్టిందని.. కొన్ని చోట్ల తన విశ్వరూపాన్ని చూపిస్తోంది కానీ.. గతంలో మాదిరి భయపెట్టే పరిస్థితి లేదని చెబుతున్నారు. మరోవైపు ఒమిక్రాన్ వణికిస్తున్నట్లుగా చెబుతున్నా.. దాని తీవ్రత జన జీవనం మీద ఉండదన్న విశ్లేషణలతో పాటు.. కరోనా కుటుంబంలో అత్యంత డేంజర్ వేరియంట్లలో చివరిది ఒమిక్రాన్ అని చెప్పటం తెలిసిందే.
అందుకు భిన్నంగా ఇప్పుడు డెల్మిక్రాన్ పేరుతో కొత్త వేరియంట్ ను చెబుతూ.. దీనికి డెల్టాకు ఉన్న తీవ్రత.. ఒమిక్రాన్ కు ఉన్న వేగం వచ్చాయని.. ఈ డబుల్ మ్యూటెంట్ తో తిప్పలు తప్పవన్న ప్రచారం మొదలైంది. 2022లో కరోనా రహిత ప్రపంచాన్ని చూస్తామన్న అంచనాను ఈ డెల్మిక్రాన్ దెబ్బ తీస్తుందన్న మాటను చెబుతున్నారు. ఈ డబుల్ వేరియంట్ తో తిప్పలు తప్పవని కొందరు చెబుతుంటే.. మరికొందరు మాత్రం దానికి అంత సీన్ లేదన్న మాటను చెబుతున్నారు.
తాజాగా తెర మీదకు వచ్చిన డెల్మిక్రాన్ మీద ఏం మాట్లాడినా తొందరపడి మాట్లాడినట్లే అవుతుందని.. కాస్త వెయిట్ చేయాలన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. వైరస్ లోజరిగే ఉత్పరివర్తనాలు కొత్త వేరియంట్ ఏర్పడేందుకు కారణమవుతాయని.. ఇలాంటి డబుల్ వేరియంట్లు ఇప్పటికే ఉన్న వేరియంట్ల కలయికతో రూపొందుతాయని సైంటిస్టులు వివరిస్తున్నారు. ఇప్పటికే డెల్టా వేరియంట్ సోకి కోలుకున్న వ్యక్తికి ఒమిక్రాన్ సోకితే అతనిలో డెల్మికాన్ రూపొందే అవకాశం ఉందంటున్నారు.ప్రస్తుతం ప్రాశ్చాత్య దేశాల్లో ఈ వేరియంట్ ఎక్కువగా కనిపిస్తోందని చెబుతున్నారు.
ఈ డెల్మిక్రాన్ వేరియంట్ బారిన పడినోళ్లలో ఉండే లక్షణాల గురించి పలువురు చెబుతున్నారు. వీరిలో..
- అధిక జ్వరం
- నిరంతర దగ్గు
- వాసన లేదంటే రుచి కోల్పోవటం
- తలనొప్పి
- ముక్కు దిబ్బడ
- గొంతులో గరగర లాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఇప్పటివరకు భారత్ లో ఇలాంటి కేసులు ఏమీ బయటపడింది లేదు. ప్రాశ్చాత్య దేశాల సంగతి ఎలా ఉన్నా.. ఇండియాలో మాత్రం డెల్మిక్రాన్ ప్రమాదం అంతగా ఉండకపోవచ్చన్న మాట వినిపిస్తోంది.
ఏమైనా ఒక భయం నుంచి బయటపడుతున్నామన్నంతనే.. మరో భయం కొత్త వేరియంట్ రూపంలో బయటకు రావటం గమనార్హం. ఇలా మరెన్ని రోజులు భయపడుతూ ఉండాలో?