Begin typing your search above and press return to search.

ఇటు చంద్రబాబు మార్క్ కసరత్తు.. లిస్ట్ రెడీ... ?

By:  Tupaki Desk   |   9 April 2022 5:30 PM GMT
ఇటు చంద్రబాబు మార్క్  కసరత్తు.. లిస్ట్ రెడీ... ?
X
కొత్త మంత్రి వర్గానికి సంబంధించి అధికారంలో ఉన్న పార్టీగా వైసీపీ కసరత్తు చేయడం సహజం. ఎవరిని ఉంచాలి. ఎవరిని పక్కన పెట్టాలి. ఎవరిని కొత్తగా చేర్చుకోవాలి. ఇలా ఆలోచిస్తూ జగన్ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఆయన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డిని పిలిపించుకుని మరీ గంటల తరబడి మంతనాలు చేస్తున్నారు.

ఇక మరో వైపు ఆశావహులు ఆ వైపు గా చూస్తూ వేడి నిట్టూర్పులు విడుస్తున్నారు. టెన్షన్ ని తట్టుకోలేక తెగ పరేషాన్ అవుతున్నారు. ఇదిలా ఉంటే వైసీపీతో పాటు టీడీపీ శిబిరంలో కూడా ఒక రకమైన హైరానా కనిపిస్తోంది. కొత్త మంత్రులు ఎవరు వస్తారు అన్నది జిల్లాలలో తమ్ముళ్లకు ఆసక్తిగా ఉంటే. వారిని ఎలా ఎదుర్కోవాలి అన్నదాని మీద కూడా ఎవరి లెవెల్ లో వారు కసరత్తు చేసుకుంటున్నారు.

ఇక అధినాయకుడు చంద్రబాబు కూడా తనదైన ప్రత్యేకమైన కసరత్తు చేస్తున్నారుట. ఇంతకీ బాబు చేసే కసరత్తు ఏంటి అంటే మాజీలు ఎవరు అవుతారు, ఆశావహుల్లో ఎవరు చాన్స్ మిస్ చేసుకుంటారు. వారిలో తొంగి చూసే వారు ఎవరు, వైసీపీ గడప దాటేవారు ఎవరు అన్న దాని మీద ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఫుల్ ఫోకస్ ఉంచింద‌ట

అంటే వైసీపీలో ఎంత కసరత్తు చేసిన ఎన్ని కూడికలు తీసివేతలు వేసుకున్నా గట్టిగా తీసుకునేది 24 మందిని మాత్రమే. కాబట్టి ఆశావహులు పెద్ద ఎత్తున ఉంటారని టీడీపీ భావిస్తోంది. అలాగే అసమ్మతి స్వరాలు కూడా ఈసారి బాగా వినిపిస్తాయని కూడా అంచనా వేస్తోంది. అలాంటి వారిలో గోడ దూకే వారు ఉంటే కనుక వారు అంగ, అర్ధ బలం, బలగం కలిగిన నేతలు అయితే ఒక లుక్కేయడానికి లిస్ట్ ప్రిపేర్ చేసుకునే పనిలో టీడీపీ ఉందని ప్రచారం సాగుతోంది.

ఇక గోదావరి జిల్లాలలతో పాటు, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఈసారి అసమ్మ‌తులు పెద్ద ఎత్తున సౌండ్ చేస్తాయని అంటున్నారు. దాంతో అలాంటి వారిని విషయంలో ఒక కన్ను వేయడం ద్వారా టీడీపీ ఫ్యూచర్ లో తనదైన పాలిటిక్స్ ని పండిస్తుంది అంటున్నారు. మొత్తానికి ఈ కసరత్తులో జగన్ కి ఒక లిస్ట్ కనిపిస్తే బాబుకు క్వైట్ అపోజిట్ గాఒక పెద్ద లిస్టే కనిపించడం ఖాయమని సెటైర్లు పడుతున్నాయి. చూడాలి మరి పరిస్థితి అంతవరకూ వస్తుందా. లేక వైసీపీ ట్రబుల్ షూటర్ సజ్జల రామక్రిష్ణారెడ్డి అసమ్మతి ఊసే లేకుండా కూల్ కూల్ చేస్తారా అన్నది