Begin typing your search above and press return to search.

ఆర్థిక సంక్షోభం: శ్రీలంక ప్రధాని పారిపోనున్నారా?

By:  Tupaki Desk   |   9 April 2022 2:30 PM GMT
ఆర్థిక సంక్షోభం: శ్రీలంక ప్రధాని పారిపోనున్నారా?
X
శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో అట్టుడుకుతోంది. దేశంలోని ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ధరలు పెరిగి అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. ఈ క్రమంలోనే ప్రజలంతా కలిసి ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేస్తున్నారు. రెండు రోజులుగా ప్రధాని రాజపక్సే ఇంటి వద్ద ప్రజలు తీవ్ర దాడులకు పాల్పడుతున్నారు. దీంతో రాజపక్సే ప్రాణాలకు ప్రమాదం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేయాలని అల్టీమేటం జారీ చేస్తున్నారు. దీంతో ప్రధాని రాజపక్సే విదేశాలకు పారిపోయే యోచనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

మరోవైపు శ్రీలంకలో ఆహార ధరలు భారీగా పెరిగాయి. కిలో చక్కెర రూ.240కి చేరింది. కిలో బియ్యం రూ.200 దాటింది. కిలో గోధుమలు రూ.190 పలికాయి.  లీటర్ కొబ్బి నూనె ధర ఏకంగా రూ.750కి చేరింది. ఒక్కో కోడిగుడ్డుకు రూ.30 చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైంది. అలాగే పిల్లలకు సంబంధించిన పాలపొడి సైతం కిలో రూ.1900కు చేరింది.  ఇక కూరగాయలు కొనలేని పరిస్థితి. ఈ క్రమంలోనే ప్రధాని మహీంద్రా రాజపక్స, గోటబయ రాజపక్సపై దేశ ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికీ శ్రీలంకను తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడేసిన రాజపక్షే సర్కారు కూలపోయింది. 26 మంత్రులు మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి దినేశ్ గుణవర్ధనే తెలిపారు. రాష్ట్రపతి కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసేందుకు తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో పరిస్థితులు దిగజారుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. అయితే రాజీనామాకు కారణం మాత్రం స్పష్టం తెలపలేదు.

ప్రధానంగా దేశంలో కర్ఫ్యూ విధించినా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపడంతో పాటు సోషల్ మీడియాను నిషేధం ఎత్తివేయడంపై ప్రజాగ్రహం పెల్లుబకింది. దీంతో అధ్యక్షుడు గటబయ రాజపక్షే, ప్రధాన మంత్రి మహేంద్ర రాజపక్షే మినహా 26 మంది రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

దేశంలో ఆర్థిక పరిస్థితిపై ప్రజలు ఆందోళన చేశారు. గంటల తరబడి కరెంట్ కోతలు, ఆహారం, నిత్యావసరాలు ఇంధనం, మందుల కొరతతో ప్రజలు అల్లాడిపోయారు. అయితే ప్రభుత్వం ఈ విషయాల్లో ఆదుకోవడంలో విఫలమైందని ప్రజలు ఆందోళన చేశారు. ఈ మేరకు కోలంబో పేజీ అనే వార్తపత్రిక ఈ విషయాలను బయటపెట్టింది. అయితే ప్రభుత్వం ఈ వార్త పత్రికతో పాటు సోషల్ మీడియా పై నిషేధం విధించింది. దేశ వ్యాప్తంగా పబ్లిక్ ఎమర్జెన్సీతో పాటు 36 గంటల పాటు కర్ఫ్పూను విధించారు. ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్, తదితర సోషల్ మీడియాలపై నిషేధం ప్రకటించారు.

ప్రజల అవసరాలను తీర్చాల్సిన ప్రభుత్వమే నిరసన కారులపై ప్రతాపాన్ని చూపడంపై కొందరు రాజకీయ నిపుణులు మండిపడుతున్నారు. ఆర్మికి అన్ని అధికారాలు ఇవ్వడంతో ఆందోళనకారులను అదుపు చేయడంతో వారు తీవ్ర చర్యలు తీసుకుంటున్నారు. శ్రీలంక అధ్యక్ష భవనం వైపు దూసుకెళ్లిన 100 మంది విపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని కట్టడి చేసి పోలీస్ స్టేసన్లకు తరలించారు.