Begin typing your search above and press return to search.

వ‌లంటీర్లకు వంద‌నమా ఎందుకు ?

By:  Tupaki Desk   |   7 April 2022 6:17 AM GMT
వ‌లంటీర్లకు వంద‌నమా ఎందుకు ?
X
వేళ‌కు పింఛ‌ను ఇచ్చిన వలంటీరుకు, కరోనా వేళ‌ల్లో కూడా తెగించి ప‌నిచేసిన వలంటీరుకు, అర్హ‌త ఉంటే చాలు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందించిన వ‌లంటీరుకు ఓ కృత‌జ్ఞ‌త‌గా చెల్లించే స‌న్మానం పై ప‌లు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. చాలా స‌మ‌స్య‌లు ఉన్నా ప‌ట్టించుకోని వ‌లంటీర్ల‌కు కూడా స‌న్మానాలు చేస్తారా అని గ‌గ్గోలు పెడుతున్న వారూ ఉన్నారు.

అనుచితంగా ప్ర‌వ‌ర్తించి రాజ‌కీయ అండ‌దండ‌ల‌తో రెచ్చిపోయిన వాళ్లూ ఉన్నారు వారికి కూడా చేస్తారా అని ప్ర‌శ్నిస్తున్నారు. ఏదేమ‌యినా ఇంత ఖ‌ర్చు ఎందుకు
క‌నీస స్థాయిలో అభివృద్ధి లేకుండా హంగామాలు ఎందుకు అని సొంత పార్టీ నాయ‌కుల‌కు కూడా పుట్టుకు వ‌స్తున్న సందేహాల‌కు జ‌గ‌న్ ఏమ‌ని సమాధానం చెబుతారు ?

ఆంధ్రావ‌నిలో ఇవాళ్టి నుంచి వలంటీర్ల‌కు వంద‌నం అనే కార్య‌క్ర‌మానికి యువ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి శ్రీ‌కారం దిద్ద‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా వలంటీర్ల‌కు న‌గ‌దు పుర‌స్కారం తో పాటు ఓ ప్ర‌శంసా ప‌త్రం అందించి శాలువ‌తో స‌త్క‌రించి ప్రోత్స‌హించ‌నున్నారు. అవినీతికి తావులేకుండా, కుల‌, మ‌త, ప్రాంతాల‌కు మ‌రియు పార్టీల‌కు అతీతంగా ప‌నిచేసిన వారికి ఈ సేవా పుర‌స్కారం గ‌డిచిన ఏడాది అందించారు.

అదేవిధంగా ఈ ఏడాది కూడా అందిస్తున్నారు. ఇందుకు రెండు వంద‌ల 26కోట్ల‌కు పైగా నిధుల‌ను కేటాయించి విడుద‌ల చేశారు కూడా ! ఇదే ఇప్పుడు విమ‌ర్శల‌కు తావిస్తోంది. గ్రామీణ ర‌హ‌దారుల‌ను బాగు చేయండి అని గ‌గ్గోలు పెడుతూ తాము ఎంతగా మొత్తుకున్నా విన‌ని స‌ర్కారుకు వ‌లంటీర్ల‌పై మాత్రం అంత ప్రేమ ఎందుక‌ని అంటే ఆ పాటి విలువ కూడా త‌మ స‌మ‌స్య‌ల‌కు లేదా అని ప్ర‌శ్నిస్తున్నారు. రెండేళ్ల కాలంలో నాలుగు వంద‌ల 65 కోట్ల రూపాయ‌ల‌కు పైగా నిధులు వెచ్చించి ఇంతటి భారీ స్థాయిలో స‌న్మానాలూ స‌త్కారాలూ చేయాల్సిన అవ‌స‌రం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

మొత్తం 2,33,333 మందికి అందించే సత్కారాల‌ను మూడు కేట‌గిరీలుగా విభ‌జించారు. సేవా వ‌జ్ర పేరిట 30 వేలు న‌గ‌దు,మెడ‌ల్, బ్యాడ్జితో పాటు శాలువా, స‌ర్టిఫికెట్ అందిస్తారు. సేవా ర‌త్న పేరిట 20 వేల న‌గదు, సేవా మిత్ర పేరిట ప‌ది వేల న‌గ‌దు ఇస్తూనే మెడ‌ల్, బ్యాడ్జీ,శాలువా అందిస్తారు. వీటితో పాటు సేవ‌కు గుర్తింపుగా స‌ర్టిఫికెట్. ఇవ‌న్నీ బాగున్నాయి కానీ వీరి గోడు మాత్రం వేరే విధంగా ఉంది.

మూడేళ్లుగా (దాదాపు) గొడ్డు చాకిరీ చేస్తున్నామ‌ని ఇచ్చే ఐదు వేలు జీతం చాల‌డం లేదు అని, వీటితో పాటు క్షేత్ర స్థాయిలో తాము అనేక అవ‌మానాలు భ‌రిస్తున్నామ‌ని వీరంతా వాపోతున్నారు. క‌నుక పుర‌స్కారాలు వ‌ద్దు అని జీతం పెంచి త‌మ‌ను గౌర‌వంగా చూస్తే చాలు అని ఓ అభిప్రాయం వీళ్ల‌లో ఉంది.