Begin typing your search above and press return to search.

పుట్టిన గంట‌కే...ఈ పిల్లోడి ఫోజు చూశారా?

By:  Tupaki Desk   |   17 Jun 2017 9:14 AM GMT
పుట్టిన గంట‌కే...ఈ పిల్లోడి ఫోజు చూశారా?
X
మొన్న‌టికి మొన్న పుట్టిన వెంట‌నే న‌ర్సు చేయి ప‌ట్టుకుని లేవ‌డానికి య‌త్నించిన ఓ న‌వ‌జాత శిశువు ఘ‌ట‌న మ‌న మది నుంచి ఇంకా చెరిగే పోలేదు. అప్పుడే మ‌రో న‌వ‌జాత శిశువు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ గా మారిపోయాడు. తాజా శిశువు ఏ ప్రాంతానికి చెందిన‌వాడో తెలియ‌దు గానీ... అత‌డు పెట్టిన ఫోజు మాత్రం విశ్వ‌వ్యాప్తంగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ గా మారిపోయింది.

బెడ్ పై ప‌డుకుని త‌ల కింద చేతులు పెట్టుకుని, త‌న‌కు ఎదురుగా ఉన్న వారి వైపు తీక్ష‌ణంగా చూస్తున్న‌ట్లు ఉన్న ఈ పిల్లాడి ఫోజు నిజంగానే అంద‌రినీ ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌ను చేసింది. ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌న‌మివ్వ‌గానే... నెటిజ‌న్లు కూడా అమితాశ్య‌ర్యం వ్య‌క్తం చేస్తూ... త‌మ‌దైన శైలిలో ఈ ఫొటో ప‌ట్ల కామెంట్లు చేస్తున్నారు.

బాలీవుడ్ హిట్ చిత్రాలు 3 ఇడియ‌ట్స్‌, మెరా బేటా ఇంజినీర్ బ‌నేగా చిత్రాల్లో హీరో ఫోజుల‌ను గుర్తుకు తెచ్చేలా ఉన్న ఈ బాలుడి ఫోజు ఉందంటూ నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకో నెటిజ‌న్ అయితే.. బాలీవుడ్ మేటి న‌టుడు నానా ప‌టేక‌ర్ 66 ఏళ్ల వ‌య‌సులో పెట్టిన ఫోజుతో ఆ కుర్రాడి ఫోజును పోల్చాడు. ముంబై వేదిక‌గా వెలువ‌డుతున్న మిడ్ డే ప‌త్రిక‌లో వ‌చ్చిన ఈ పిల్లోడి ఫోజు నిజంగానే ఇట్టే క‌ట్టి ప‌డేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/