Begin typing your search above and press return to search.
సిద్ధిపేట జిల్లాలో కొత్త మండలం.. ఎప్పటి నుంచి అంటే?
By: Tupaki Desk | 9 Dec 2020 10:55 AM ISTతెలంగాణ రాష్ట్రంలో చాలానే జిల్లాలు ఉన్నా.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిద్దిపేట అంటే సో స్పెషల్ అన్న విషయం తెలిసిందే. తాజాగా కేసీఆర్ సర్కారు మరో ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటివరకు ఉన్న మండలాలకు అదనంగా ధూళిమిట్ట మండలాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వుల్ని రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ విడదల చేశారు. ఈ రోజు నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి.
ధూళిమిట్ట మండలాన్ని సిద్దిపేట జిల్లాలో ఏర్పాటుచేశారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ప్రభుత్వం చెప్పటం.. అలా వచ్చిన వాటిని పరిశీలించి.. తాజాగా సిద్ధిపేట జిల్లాలో ఈ కొత్త మండలం చేరేలా చర్యలు తీసుకున్నారు. ఈ కొత్త మండలం కింద ఎనిమిది గ్రామాలు రానున్నాయి.
ధూళిమిట్ట.. లింగాపూర్.. జాలపల్లి.. తోర్నల.. బైరాన్ పల్లి.. బెక్కల్.. కొండాపూర్.. కూటిగల్ గ్రామాలు రానున్నాయి. సిద్ధిపేట డివిజన్ కు రెండు గ్రామాల్ని బదిలీ చేశారు. అదే సమయంలో జిల్లాకు చెందిన హుస్నాబాద్ డివిజన్ మద్దూరు మండలంలోని రెండు గ్రామాల్ని సిద్దిపేట డివిజన్ లోని చేర్యాల మండలానికి బదిలీ చేసింది. ఈ రోజు నుంచి కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి.