Begin typing your search above and press return to search.

న్యూజిలాండ్ కూడా ట్రంప్ బ్యాచ్ లో చేరిపోయింది

By:  Tupaki Desk   |   20 April 2017 7:10 AM GMT
న్యూజిలాండ్ కూడా ట్రంప్ బ్యాచ్ లో చేరిపోయింది
X
డొనాల్డ్ ట్రంప్ సంకుచిత జాతీయవాద భావజాలం ప్రపంచ దేశాల నాయత్వంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కీలక దేశాలు కూడా అంతర్జాతయ దృక్పథాన్ని వీడి పూర్తిగా స్వదేశీ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్నారు. అందులో తప్పు పట్టాల్సిందేమీ లేకున్నా ఇలాంటి మార్పు కారణంగా ప్రపంచ వ్యాప్తంగా నాలెడ్జి షేరింగ్ - టెక్నాలజీ ట్రాన్సఫర్ నెమ్మదిస్తుందని.. నాలెడ్జి - ప్రగతికి పరిధులు గీసుకున్నట్లవుతుందని నిపుణులు అంటున్నారు.

తమ దేశంలో ఉపాధి అవకాశాలను పెంచుకోవడానికంటూ, అమెరికా - ఆస్ట్రేలియా దేశాలు ఇప్పటికే విదేశీ ఉద్యోగులకు ఇచ్చే వీసాలపై ఆంక్షలను విధించగా, తాజాగా ఆ జాబితాలో న్యూజిలాండ్ కూడా చేరింది. ఈ మేరకు వీసా నిబంధనలను కఠినం చేస్తున్నట్టు ఆ దేశ ఇమిగ్రేషన్ శాఖ మంత్రి మైఖేల్ వుడ్ సౌస్ వెల్లడించారు. న్యూజిలాండ్ లోని చాలా కంపెనీలు విదేశీ ఉద్యోగులపై ఆధారపడి ఉన్నాయని వ్యాఖ్యానించిన ఆయన - న్యూజిలాండ్ పౌరులకు ఉపాధి - అభివృద్ధి - సంక్షేమానికి కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

వీసా నిబంధనల మార్పుల్లో భాగంగా అధిక నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు వేతన పరిమితి పెంపు వంటి నిర్ణయాలు తీసుకోనున్నారు. న్యూజిలాండ్ లో కూడా విదేశీ వృత్తి నిపుణుల్లో - అందునా ఐటీ రంగంలో భారతీయులే అత్యధికులు. వీరందరిపైనా తాజా వీసా నిబంధనల మార్పు ప్రభావం పడనుంది. ప్రపంచానికి పెద్ద సంఖ్యలో టెక్ నిపుణుల ను అందిస్తున్న దేశంగా భారత్ ఇలాంటి నిర్ణయాలతో తీవ్ర నష్టం చవిచూడాల్సి వస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/