Begin typing your search above and press return to search.

ట్రంప్ క‌న్ను ఇప్పుడు విమానంపై ప‌డింది

By:  Tupaki Desk   |   8 March 2017 2:30 PM GMT
ట్రంప్ క‌న్ను ఇప్పుడు విమానంపై ప‌డింది
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ల‌దే అమెరికా అనే నినాదంతో ముందుకు పోతుండ‌టంతో ఆ దేశంలోని వ్యాపార‌వేత్త‌లు త‌మ ఆలోచ‌న‌లకు ప‌దును పెడుతున్నారు. ఈ క్ర‌మంలో విదేశీయుల‌కు చెందిన వ్యాపారాలు త‌మ అభివృద్ధికి అడ్డుగా మారుతుండ‌టానికి ట్రంప్ అండ‌తో ఫుల్ స్టాప్ పెట్టాల‌ని చూస్తున్నారు. ప్రపంచ ప్ర‌ఖ్యాత‌ ఎమిరేట్ ఎయిర్‌ లైన్స్ అమెరికాలోని నెవార్క్-న్యూజెర్సీ-ఏంథీన్స్ మధ్య నాన్‌ స్టాప్ విమాన సర్వీసును ఆదివారం నుంచి ప్రారంభించబోతుండ‌గా ఆ దేశానికి ప్ర‌జాప్ర‌తినిధులు దీన్ని నిలిపివేయాలని కోరుతున్నారు. దీనికోసం ఏకంగా 25 మంది ప్ర‌జాప్ర‌తినిధులు ట్రంప్‌కు లేఖ రాశారు. మీ ఆలోచ‌న‌ల‌కు మీరే తూట్లు పొడ‌వ‌ద్ద‌ని కోరుతూ సెంటిమెంట్ అస్త్రాన్ని కూడా ప్ర‌యోగించారు.

నెవార్క్-న్యూజెర్సీ-ఏంథీన్స్ ల మ‌ధ్య ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ న‌డ‌ప‌డం వ‌ల్ల అమెరికాకు చెందిన సంస్థ‌లు పెద్ద ఎత్తున న‌ష్ట‌పోతామ‌య‌ని స‌దరు ప్ర‌జా ప్ర‌తినిధులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తక్కువ ధరలకే సర్వీసులను అందిస్తుండ‌టం వ‌ల్ల ప్రయాణీకులు ఈ సంస్థల సర్వీసులనే ఉపయోగిస్తున్నారని తెలిపారు. త‌ద్వారా అమెరికా విమాన‌యాన సంస్థ‌లు పెద్ద ఎత్తున న‌ష్ట‌పోతున్నాయ‌ని వివ‌రించారు. అంతేకాకుండా ఈ సంస్థ‌లు అమెరికా నుంచి భారీగా రాయితీలను పొందుతున్నాయ‌ని, పైగా ఈ విమానాశ్రయ సంస్థల్లో పని చేసే వారు కూడా గల్ఫ్ దేశాలకు చెందిన వారేనని ట్రంప్‌కు రాసిన లేఖ‌లో వారు ఫిర్యాదుల ప‌ర్వాన్ని వినిపించారు. 2004 నుంచి నేటి వరకూ దాదాపు 50 బిలియన్ డాలర్ల మేర ఈ ఎయిర్‌లైన్స్ అమెరికా నుంచి లాభాలను ఆర్జించాయన్నారు. అందుకే ఇక‌నైనా వీటి బ్రేకులు వేయాల‌ని కోరారు. ఇలాంటి సంస్థ‌ల‌ను క‌ట్ట‌డి చేయాల‌ని త‌ద్వారా అమెరికా ప్ర‌యోజ‌నాల‌కు పాటుప‌డాల‌ని కోరారు.​

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/