Begin typing your search above and press return to search.

హాలీవుడ్ సీన్ ఒకటి అమెరికాలో ఆవిష్కృతమైంది!

By:  Tupaki Desk   |   1 April 2020 4:50 AM GMT
హాలీవుడ్ సీన్ ఒకటి అమెరికాలో ఆవిష్కృతమైంది!
X
ఊహించలేని విపత్తు చోటు చేసుకుంటుంది. ఆకాశాన్ని అంటే మహానగరాల్లో శశ్మాన నిశ్శబ్దం చోటుచేసుకోవటం.. భారీ విధ్వంసం చోటు చేసుకోవటం.. మళ్లీ ఎప్పటికి ఒక కొలిక్కి వస్తుందా? అన్నట్లుగా ఉండే సీన్లు చాలానే తరచూ హాలీవుడ్ సినిమాల్లో చూస్తుంటాం. అలాంటి అసాధారణ సీన్ ఒకటి తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో ఆవిష్కృతమైంది. ప్రపంచ వ్యాప్తంగా 185 దేశాలకు విస్తరించి.. ఇప్పటి వరకూ ప్రపంచాన్ని మరెవరూ చేయలేనంత ప్రభావానికి గురి చేసింది కరోనా.. ఈ వారంతానికి పదిలక్షల మంది కరోనా బాధితులు ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతారన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయం లో.. రోజు వారీగా భారీ ఎత్తున మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకూ కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 40వేల మంది మరణిస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కేవలం యుద్ధ సమయాల్లో మాత్రమే కనిపించే సీన్ ఒకటి అమెరికాలో తాజాగా ఆవిష్కృతమైంది. న్యూయార్క్ సెంట్రల్ పార్కులో క్షేత్రస్థాయిలో ఆసుపత్రుల్ని ఏర్పాటు చేశారు. కరోనా వేళ.. వైద్య సాయం కోసం వస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోవటంతో..ఆ అవసరాలకు సరిపడా ఏర్పాట్లు చేసేందుకు వీలుగా దీన్ని ఏర్పాటు చేశారు.

అంతేకాదు.. మన్ హట్టన్ దగ్గరిలో ఒక యుద్ధ నౌకలో వెయ్యి పడకల ఆసుపత్రిని సిద్ధం చేశారు. ఇప్పటివరకూ అమెరికాలో 1.74 లక్షల మంది కరోనా బారిన పడితే.. 3,400 మంది బలి అయ్యారు. ఇటీవల కాలంలో ఒక విపత్తు సందర్భం గా ఇంత భారీగా అమెరికన్లు ఎప్పుడూ మరణించింది లేదు. పలు నగరాల్లో పుడ్ బ్యాంకుల్లో ఆహారం కోసం ప్రజలు క్యూ కడుతున్నారు.

కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పినప్పటిక.. రానున్న నెల రోజుల్లో అమెరికా అతి పెద్ద సవాలు ఎదుర్కోనుందని చెబుతున్నారు. కొన్ని అంచనాల ప్రకారం.. అమెరికా లో కరోనా కారణంగా రెండు లక్షల మంది మరణించే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే.. పాజిటివ్ సంఖ్య అంతకంతకూ పెరిగి పోతోంది. రోజు గడిచే సరికి తక్కువలో తక్కువ 20వేలకు దగ్గర దగ్గరగా పాజిటివ్ కేసులు నమోదు కావటం గమనార్హం.