Begin typing your search above and press return to search.

పాఠక దేవుళ్లకు తుపాకీ.కాం నూతన సంవత్సర శుభాకాంక్షలు

By:  Tupaki Desk   |   1 Jan 2017 12:00 AM IST
పాఠక దేవుళ్లకు తుపాకీ.కాం నూతన సంవత్సర శుభాకాంక్షలు
X
మీడియా అంటే ప్రజల చేతిలో ‘తుపాకీ’.. తుపాకీ చేతిలో ఉన్న ప్రతి ఒక్కడూ తూటాలు పేల్చకపోవచ్చు. కానీ, అది ఇచ్చే ధైర్యం అంతాఇంతా కాదు. అందుకే అలాంటి ధైర్యాన్నే పేరుగా మార్చుకున్న తెలుగు వార్తల వెబ్ సైట్ ‘తుపాకీ’. తెలుగు రాష్ట్రాలకు చెందిన వార్తలను అందించడంలో ముందున్న ఏకైక న్యూస్ వెబ్ సైట్ తుపాకీ.కాం. స్వదేశంలోనే కాదు దేశదేశాల్లోనూ ఆదరణ పొందిన అచ్చ తెలుగు డిజిటల్ మీడియా మనది. 24 గంటలూ వార్తావిశేషాలను అందిస్తూ పాఠకాదరణ పొందుతున్న తుపాకీ.కాంను కొత్త సంవత్సరంలోనూ ఇలాగే ఆదరించాలని కోరుకుంటూ అందరికీ తుపాకీ.కాం తరఫున కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాం.

2016 సంవత్సరంలో తుపాకీ.కాంను పాఠకులు మరింత సమున్నత స్థానానికి తీసుకెళ్లారు. ప్రింటు - ఎలక్ర్టానిక్ రంగ దిగ్గజాల డిజిటల్ మాధ్యమాలకు ధీటుగా వార్తలు ఇవ్వడంలో పోటీపడుతున్న తుపాకీ.కాం వేగం... వార్తల వెనుక నిజాలను నిర్భయంగా చెప్పగలిగే తెగువ.. పరిణామాలను అరటిపండు ఒలిచి పెట్టినట్లు చెప్పే విశ్లేషణాత్మకత.. అన్నీ పాఠకులు అందించిన తోడ్పాడు - స్ఫూర్తితో సాధించినవే. ఆ పాఠకాభిమానమే తుపాకీ.కాంను 2016లో నంబర్ 1 తెలుగు వార్తల (పత్రికలు - ఛానళ్ల మద్దతు లేని) వెబ్ సైట్ గా నిలిపింది.

తుపాకీ.కాం సాధించిన ప్రతి ఘనత వెనుకా పాఠకులే ఉన్నారు. ఏటా తుపాకీ.కాం ర్యాంకు మెరుగుపడడానికి, ఆదరణ పెరగడానికీ వారే కారణం. ఎప్పటిలానే 2017లోనూ తుపాకీపై తమ ఆదరాభిమానాలు చూపించాలని కోరుకుంటూ మరోసారి అందరికీ.. ‘‘నూతన సంవత్సర శుభాకాంక్షలు’’.