Begin typing your search above and press return to search.

వైఎస్ ఆర్సీపీ ఎమ్మెల్యేల ఇళ్ల వ‌ద్ద క‌నిపించ‌ని న్యూ ఇయ‌ర్ సంద‌డి!

By:  Tupaki Desk   |   3 Jan 2020 1:30 AM GMT
వైఎస్ ఆర్సీపీ ఎమ్మెల్యేల ఇళ్ల వ‌ద్ద క‌నిపించ‌ని న్యూ ఇయ‌ర్ సంద‌డి!
X
గ‌త ఏడాది ఆరంభానికి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉండేది. అయితే న్యూ ఇయ‌ర్ తొలి రోజున వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ - నియోజ‌క‌వ‌ర్గాల ఇన్ చార్జిల ఇళ్లు కిటకిట‌లాడాయి. పార్టీ అభిమానులు - ఎమ్మెల్యేల ఫాలోయ‌ర్లు పెద్ద ఎత్తున వాళ్ల ఇళ్ల‌కు వెళ్లి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ అలా న్యూ ఇయర్ వేడుకల సంద‌ర్భంగా ఎమ్మెల్యేల ఇళ్లు క‌ళ‌క‌ళ‌లాడాయి. పార్టీ అధికారంలో లేక‌పోయినా.. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌ - నియోజ‌క‌వ‌ర్గాల నేత‌ల ఇళ్ల వ‌ద్ద సంద‌డి అంతా ఇంతా కాదు. అప్ప‌టి అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నేత‌ల ఇళ్ల వ‌ద్ద కూడా అప్ప‌టికి జేజేలు కొట్టిన కార్య‌క‌ర్తలు ఉన్నా - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల ఇళ్ల వ‌ద్ద క‌నిపించిన ఊపు వేరే! పార్టీలో ఎంతో ఉత్సాహాన్ని తీసుకు వ‌చ్చాయి గ‌త ఏడాది న్యూ ఇయ‌ర్ వేడుక‌లు.

సాధార‌ణంగా నియోజ‌క‌వ‌ర్గం స్థాయి ప‌ట్ట‌ణాల్లో ఎమ్మెల్యేని లేదా త‌త్స‌మాన నేత‌ను క‌లిసి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెల‌ప‌డం చాలా మందికి రాజ‌కీయ ఔత్సాహికుల‌కు రొటీనే. న్యూ ఇయ‌ర్ ఉత్సాహాన్ని అలా వారు స్థానిక‌ రాజ‌కీయ నేత‌తో పంచుకుంటూ ఉంటారు. అలా స‌ద‌రు నేత ఇంటికి వ‌చ్చి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపే కార్య‌క‌ర్త‌ల‌ - జ‌నాల సంఖ్య‌ను బ‌ట్టి స‌ద‌రు నేత‌ల ఫాలోయింగ్ ను అంచ‌నా వేయ‌వ‌చ్చు. అలా వారు కార్య‌క‌ర్త‌ల‌కు ఎంత‌లా అందుబాటులో ఉంటున్నారు, కార్య‌క‌ర్త‌ల్లో వారు ఎంత‌లా క‌లిసిపోతున్నారు అనే అంశాల‌ను అర్థం చేసుకోవ‌చ్చు.

అయితే గ‌త ఏడాదితో పోల్చుకుంటే ఇప్పుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల ఇళ్ల వ‌ద్ద సంద‌డి బాగా త‌గ్గ‌డం గ‌మ‌నార్హం. జ‌న‌వ‌రి ఒక‌టో తేదీన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇళ్ల ద‌గ్గ‌ర పెద్ద‌గా కార్య‌క‌ర్త‌ల హ‌డావుడి క‌నిపించ‌లేదు. గ‌త ఏడాది ఆరంభంలో నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌ల‌ను చెప్ప‌డానికి ఎమ్మెల్యేల ఇళ్ల వ‌ద్ద కార్య‌క‌ర్త‌లు క్యూ క‌ట్టారు. అయితే ఇప్పుడు వారిలో అంత ఉత్సాహం క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఒక‌వైపు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అప్ప‌టితో పోలిస్తే ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు బాగా చేరువ అయ్యారు. అప్పుడు కేవ‌లం ప్ర‌తిప‌క్ష నేత‌గానే జ‌గ‌న్ ఉండేవారు. ఇప్పుడు ముఖ్య‌మంత్రి హోదాలో ఆయ‌న ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యారు. అనేక ర‌కాల సంక్షేమ ప‌థ‌కాల‌తో - విభిన్న పాల‌నా రీతితో జ‌గ‌న్ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూ ఉన్నారు. ఆరు నెల‌ల్లోనే ప్ర‌జ‌లు మెచ్చుకునే ముఖ్య‌మంత్రిని అవుతానంటూ ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ప్పుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆ మేర‌కు మాట‌ను నిల‌బెట్టుకునేలా సాగుతున్నారు. జ‌గ‌న్ ఇప్పుడు న‌చ్చ‌నిది హార్డ్ కోర్ తెలుగుదేశం అభిమానుల‌కు మాత్ర‌మే. వారిని పక్క‌న పెడితే జ‌గ‌న్ అంద‌రిలోనూ మంచి మార్కులు వేయించుకుంటూ ఉన్నారు.

అయితే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో చాలా మంది అధినేత‌కు భిన్న‌మైన దారిలో వెళ్తున్న దాఖ‌లాలు క‌నిపిస్తూ ఉన్నాయి. అధికారంలోకి వ‌చ్చి ఆరు నెల‌లు గ‌డిచిపోయినా.. వారిలో చాలా మంది ఇప్ప‌టికీ పార్టీ శ్రేణుల‌కు చేరువ కాలేదు. అధికారంలోకి రాగానే చాలా మంది ఎమ్మెల్యేలు సొంత ప‌నులు చ‌క్క‌బెట్టుకోవ‌డం మీదే కాన్స‌న్ ట్రేట్ చేశారు. ఎన్నిక‌ల‌కు ముందు వెంట తిప్పుకున్న కార్య‌క‌ర్త‌ల‌ను కూడా వారు ఇప్పుడు ప‌ట్టించుకోవ‌డం మానేశారు. దీంతో కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం త‌గ్గిపోయింది. ఎమ్మెల్యేల వ‌ద్ద‌కు వెళ్లిన‌ప్పుడు అక్క‌డ రిసెప్ష‌న్ బాగుంటేనే ఏ కార్య‌క‌ర్త అయినా అక్క‌డ‌కు మ‌ళ్లీ వెళ్ల‌డానికి ఉత్సాహం చూపిస్తారు. లేక‌పోతే అటు వైపు వెళ్ల‌రు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల విష‌యంలో అదే జ‌రుగుతూ ఉంద‌ని తెలుస్తోంది. ఆ ప్ర‌భావం న్యూ ఇయ‌ర్ రోజున స్ప‌ష్టం అయ్యింది. ఆ జోష్ ఇప్పుడు లేదు వైసీపీ ఎమ్మెల్యే ఇళ్ల వ‌ద్ద‌. అలాగే మ‌రి కొంద‌రు ఎమ్మెల్యే న్యూ ఇయ‌ర్ తొలి రోజున నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికారిక నివాసాల్లో క‌నిపించ‌లేదు. దీంతో అక్క‌డ అభిమానుల తాకిడి లేకుండా పోయింద‌ని తెలుస్తోంది