Begin typing your search above and press return to search.

న్యూ ఇయర్ సెలెబ్రేషన్ .... ఒక్క రాత్రి కే 500 కోట్లు స్వాహా !

By:  Tupaki Desk   |   1 Jan 2020 9:44 AM GMT
న్యూ ఇయర్ సెలెబ్రేషన్ .... ఒక్క రాత్రి కే 500 కోట్లు స్వాహా !
X
ప్రపంచం మొత్తం న్యూ ఇయర్ కి చాలా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్ ని ఎవరి రేంజ్ కి తగ్గట్టు వారు సెలెబ్రేట్ చేసుకున్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత పిల్లలు , పెద్దలు అన్న తేడా లేకుండా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ విషెష్ చెప్పుకుంటూ ఆనందంలో మునిగిపోయారు. ముఖ్యంగా యూత్‌... ఫుల్ జోష్‌ లో మునిగి పోయింది. ఓ వైపు మాస్, ఫాస్ట్ బీట్ సాంగ్స్‌కు స్టెప్పులు వేస్తూనే... మరో వైపు మందు బాటిళ్లు , బీర్లతో తో మత్తులో మునిగితేలారు. ఇక, ఈ న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేకం గా ఈవెంట్లు నిర్వహించి మరీ ఆకర్షించాయి.

అయితే , ఈ హడావిడి ప్రతి ఏడాది ఉండేది. కానీ , 2019 ఇయర్ ఎండింగ్ అయిన డిసెంబర్ 30, 31 తేదీల్లో లిక్కర్‌ అమ్మకాలు జోరు గా సాగినట్టు వాటి లెక్కలు చెబుతున్నాయి. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం అయిన ప్రతి ఒక్కరు కూడా వైన్ షాప్స్ , బార్ల ముందు క్యూలు కట్టారు. గత రెండు రోజుల నుండి వైన్ షాప్స్ , బార్ల వద్ద పెద్ద సందడి వాతావరణం కనిపిస్తుంది. అయితే , డిసెంబర్ 31 న ఉండే రష్ ని ముందుగానే ఊహించిన కొందరు మందుబాబులు... ముందు చూపుతో 30వ తేదీనే జోరుగా మద్యం కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.

దీనితో డిసెంబర్ 30వ తేదీన దాదాపుగా రూ.250 కోట్ల వరకు లిక్కర్ వ్యాపారం జరిగినట్టు తెలుస్తుంది. ఇక డిసెంబర్ 31వ తేదీన సాయంత్రం వరకే రూ.150 కోట్ల కు పైగా అమ్మకాలు సాగగా.. అర్ధరాత్రి వరకు వైన్ షాపులు, బార్లు, స్పెషల్ ఈవెంట్లు ఇలా ఫుల్‌గా లిక్కర్ అమ్మకాలతో మరో రూ.100 కోట్లకు పైగానే ఖర్చు చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కని బట్టి చూస్తే ...కేవలం రెండు రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగానే లిక్కర్ ని తాగేశారు. ఇక, జనవరి 1వ తేదీన న్యూ ఇయర్ సందర్భంగా సెలవు కాబట్టి ..నేడు కూడా మద్యం వ్యాపారులకు పండుగే అని చెప్పవచ్చు. దీన్ని బట్టి ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా జరిగిన మద్యం అమ్మకాలు రికార్డు స్థాయి లో జరిగినట్టు చెప్పవచ్చు .......