Begin typing your search above and press return to search.
తెలంగాణలో విస్తరిస్తున్న కొత్త వైరస్
By: Tupaki Desk | 18 Aug 2020 11:02 AM ISTతెలంగాణను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఓవైపు కరోనా.. మరోవైపు కుంభవృష్టిగా కురుస్తున్న వానలు ప్రజలను టెన్షన్ పెడుతున్న వేళ ఇప్పుడు తాజాగా కొత్త వైరస్ బయటపడడం ఆందోళనకు కారణమవుతోంది.
తెలంగాణలో ఇప్పుడు పశుసంపదను ఒక కొత్త వైరస్ అతలాకుతలం చేస్తోంది. ఈ కొత్త వైరస్ కారణంగా ఇప్పటికే 11 పశువులు చనిపోయాయి. మే-జూన్ నెలల్లో వనపర్తి జిల్లాలో విజృంభించిన ఈ వైరస్ ఇప్పుడు ఆదిలాబాద్ రైతాంగానికి నిద్రలేకుండా చేస్తోంది.
‘లంపీ స్కిన్’ అనే ఈ కొత్త వైరస్ పశువుల్లో వేగంగా వ్యాపిస్తోందని తేలింది. ముఖ్యంగా ఆవులు, ఎద్దులు, దూడలకు ఈ వైరస్ ఎక్కువగా సోకుతోంది.
ఈ వ్యాధి సోకిన పశువుల చర్మంపై బొబ్బలు, బొడిపెలు వస్తాయి. వ్యాధిని కనిపెట్టి చికిత్స అందిస్తే నయం చేయవచ్చని పశువైద్యులు చెబుతున్నారు. రూ.1500 వరకు ఖర్చు అవుతుందని తెలుపుతున్నారు.
కాగా ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తుందా? వ్యాపిస్తుందా ప్రమాదమా అన్న సంగతి నిగ్గుతేలాల్సి ఉంది.