Begin typing your search above and press return to search.

వందేళ్ల‌కు ఒక వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోందా?

By:  Tupaki Desk   |   15 March 2020 7:53 AM GMT
వందేళ్ల‌కు ఒక వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోందా?
X
1720లో ప్లేగు వ్యాధి ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేసింది.. ప్ర‌త్యేకించి యూర‌ప్ ను. ఆ త‌ర్వాత 1820లో క‌ల‌రా వ్యాధి సోకింది.. ఇది ర‌ష్యా నుంచి ప్ర‌పంచానికి వ్యాపించింది. 1920లో స్పానిష్ ఫ్లూ అనేక మంది మ‌ర‌ణానికి కార‌ణం అయ్యింది.. అది ఫ్రాన్స్ నుంచి బ‌య‌ల్దేరింది. ఇప్పుడు స‌రిగా వందేళ్ల‌కు 2020లో క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతూ ఉంది. ఇది చైనా నుంచి సంక్ర‌మించింద‌నే వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

స‌రిగా ప్ర‌తి వందేళ్ల‌కూ ఒక ర‌క‌మైన కొత్త వైర‌స్ ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతూ ఉంద‌ని అంటున్నారు నిపుణులు. క‌చ్చితంగా వందేళ్ల‌కు ఇలాంటివి చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. సోష‌ల్ మీడియాలో ఈ విష‌యం గురించి పోస్టులు క‌నిపిస్తున్నాయి.

ఇక క‌రోనా విష‌యంలో చైనాను నిందించ‌డం స‌రికాద‌ని మ‌రి కొంద‌రు అంటున్నారు. పైన పేర్కొన్న వివిధ ర‌కాల వైర‌స్ లు వివిధ దేశాల నుంచి స‌క్ర‌మించిన‌వి కావ‌డం గ‌మ‌నార్హం. అలాగే ఆఫ్రికా దేశాల నుంచి కూడా ప్ర‌పంచానికి వివిధ ర‌కాల వైర‌స్ లు సోకాయి. బ్రెజిల్ నుంచి జికా, ఆఫ్రికా దేశాల నుంచి ఓబోలా వంటి వైర‌స్ మిగిలిన ప్ర‌పంచాన్ని ఇబ్బంది పెట్టాయి. ఈ ప‌రిణామాల‌న్నింటినీ గ‌మ‌నించి చైనాను మాత్ర‌మే నిందించాల్సిన అవ‌స‌రం లేద‌ని, క‌రోనా తీవ్ర‌త‌ను దృష్టిలో పెట్టుకుని ఏదేశానికాదేశం దాని నివార‌ణ చ‌ర్య‌లు తీసుకుంటే మంచిద‌ని విశ్లేష‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.