Begin typing your search above and press return to search.

కరోనాతో గుండెకు కొత్త సమస్య

By:  Tupaki Desk   |   30 March 2020 10:30 PM GMT
కరోనాతో గుండెకు కొత్త సమస్య
X
కరోనా వైరస్‌ ప్రభావం వృద్దులపై ఎక్కువగా ఉంటుందని.. గుండె సంబంధిత రోగాలతో బాధపడుతున్న వారిలో ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే నిర్థారణ అయ్యింది. గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారు కరోనా బారిన పడితే మృతి చెందే శాతం చాలా ఎక్కువగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇదే సమయంలో హ్యూస్టన్‌ లోని ఒక యూనివర్శిటీ అధ్యయనంలో మరో ఆసక్తికర విషయం వెళ్లడయ్యిందని ఆ యూనివర్శిటీ కి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మొహమూద్‌ మజీద్‌ పేర్కొన్నారు.

గుండె జబ్బు లేని వారికి కరోనా వైరస్‌ సోకినట్లయితే గుండె సంబంధిత కండరాలు ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. కరోనా నెగటివ్‌ కు వచ్చిన తర్వాత కూడా గుండె సమస్యలు వెంటాడే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నాడు. అయితే ఇది చాలా తక్కువ శాతం మాత్రమే అన్నాడు. గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు కరోనా వైరస్‌ సోకడం వల్ల ఎక్కువ ప్రభావితం అవుతున్నారని ఆయన అన్నాడు.

రక్తపోటుతో బాధపడే వారు కరోనా వైరస్‌ బారిన పడటం వారు 65 ఏళ్లకు పైగా ఉన్న వారు అయితే వారి పరిస్థితి సీరియస్‌ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. అయితే వంద ఏళ్లు దాటిన వారు కూడా కరోనా పాజిటివ్‌ నుండి నెగటివ్‌ కు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. అయితే పూర్తి ఆరోగ్యంగా ఉండి ఇమ్యూనిటీ పవర్‌ ఎక్కువగా ఉన్న వారు వయసుతో సంబంధం లేకుండా ఈజీగానే కరోనాను జయించవచ్చు అంటూ వైధ్యులు చెబుతున్నారు. మానసికంగా శారీరకంగా స్ట్రాంగ్‌ గా ఉన్న వారు కరోనాను ఈజీగానే ఎదురించవచ్చు అంటూ నిపుణులు చెబుతున్నారు.

--