Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: అమెరికాలో 5 వేలు దాటిన కరోనా మృతులు !

By:  Tupaki Desk   |   2 April 2020 3:40 PM IST
బ్రేకింగ్: అమెరికాలో 5 వేలు దాటిన కరోనా మృతులు !
X
కరోనా వైరస్ ... ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ఇప్పటికే కొన్ని వేలమందిని మృత్యువు ఒడిలో చేర్చింది. ఈ కరోనా మహమ్మారిని అడ్డుకట్ట వేయడానికి ప్రపంచం మొత్తం శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా పలు దేశాలు నిషేధాజ్ఞలు విధించి, ప్రజలను ఇంట్లో నుండి బయటకి రావద్దు అంటూ హెచ్చరికలు జారీచేసింది. ప్రపంచంలోని 200పైగా దేశాలకు విస్తరించిన ఈ కరోనా వైరస్‌, అగ్రరాజ్యాన్ని సైతం హడలిపోయేలా చేస్తుంది.

రోజుకు సగటున 20వేల మందికిపైగా అమెరికాలో ఈ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 884మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో కరోనా వైరస్‌తో మరణించిన వారిసంఖ్య 5,093కు చేరింది. దేశంలో ఇప్పటి వరకూ 2.15 లక్షల మందికి వైరస్ సోకినట్టు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు అమెరికా లో నమోదయ్యాయి. గత వారం రోజులుగా అమెరికా లో కరోనా కేసులు వేల సంఖ్యలో పెరిగి పోతుండటంతో అమెరికా ప్రజలు భయంతో వణికి పోతున్నారు.

అయితే, దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న కూడా, అమెరికా ప్రెసిడెంట్ పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ ప్రకటించడానికి మరోసారి నిరాకరించారు. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ఆయా రాష్ట్రాలు లాక్‌ డౌన్‌ పై నిర్ణయం తీసుకుంటున్నాయని ట్రంప్ స్పష్టం చేశారు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఇప్పటికే 30కోట్ల మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ముందస్తు ఆంక్షలు ఏప్రిల్‌ 30వరకు కొనసాగనున్నాయి. ఇకపోతే మరో 30 రోజులపాటు సామాజిక దూరాన్ని పాటించడం ద్వారా కరోనా వైరస్‌ తీవ్రత తగ్గించ వచ్చని అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే అందరికి సూచించారు.