Begin typing your search above and press return to search.
హై అలెర్ట్... జూన్ లో కొత్త వేరియంట్.. !
By: Tupaki Desk | 22 March 2022 5:00 AM ISTప్రపంచం వ్యాప్తంగా మరో సారి కోవిడ్ కేసులు వివిధ దేశాల్లో భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే కోవిడ్ వేరియంట్ అయిన ఒమిక్రాన్ తో వేగంగా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తుంది. అలాగే మరోసారి తన ప్రభావాన్ని చూపించేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తుంది.
గతంలో మాదిరిగానే పక్క దేశమైన చైనా లో వైరస్ కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. చైనాలో మాత్రమే కాకుండా ఇతర ఆసియా దేశాల్లో కూడా కేసుల నమోదు బాగానే ఉంది. మరో దేశం అయిన హాంకాంగ్ లో కూడా కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగినట్లు ఇప్పటికే చైనా ఆరోగ్య శాఖ ప్రకటించింది. జీరో కొవిడ్ కేసులు దిశగా అడుగులు వేస్తున్న చైనా... దేశంలోని చాలా ప్రావిన్స్ లో గతంలో అమలు చేసినట్లు లాక్ డౌన్ విధించింది.
కరోనా వైరస్ కు పుట్టినిల్లు అయిన చైనాలో వైరస్ మరోసారి వ్యాప్తి చెందడం పై పక్కన ఉన్న దేశాల్లో కంగారు మొదలైంది. ఇప్పటికే వివిధ దశల్లో వివిధ వేరియంట్లతో చాలా మంది ప్రాణాలను బలిగొంది వైరస్. దీంతో ప్రాణ నష్టం కూడా ఎక్కువ అయ్యింది. మరోసారి కోవిడ్ విజృంభిస్తే నియంత్రణ ఎలా అని అనుకుంటున్నారు.
ఇక భారత్ విషయానికి వచ్చే సరికి కొత్త వేరియంట్ పుట్టే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. బహుశా ఈ కొత్త వేరియంట్ ఈ ఏడాది జూన్ లో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ఒమిక్రాన్ నుంచి కొత్త వేరియంట్లు వచ్చే అవకాశాలు లేకపోలేదు అని చెప్తున్నారు.
దీనికి తోడు వ్యాక్సిన్ లు తీసుకోవడం కూడా మంచి చేస్తుందని చెబుతున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ లు తీసుకున్న వారిపై ఒమిక్రాన్ ప్రభావం తక్కువ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకునే వారిలో ఇప్పటికే మంచి వ్యాధి నిరోధక శక్తిని గుర్తించినట్లు చెప్తున్నారు.
ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు, సూపరింటెండెంట్ రాజారావు. ఒమిక్రాన్ ప్రభావం పెద్దగా భారతీయుల పైన ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. ఇదిలా ఉంటే కోవిడ్ కేసుల సంఖ్య కూడా బాగా తగ్గిందని అన్నారు. గతంతో పోల్చితే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని అన్నారు. వైరస్ వ్యాప్తిపై భయపడాల్సిన పని లేదని తెలిపారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు.
గతంలో వైరస్ మనపై దాడి చేసిన విధానాన్ని పరిశీలిస్తే.. నాలుగో వేవ్ ఒక వేళ వస్తే జూన్ లో వచ్చే అవకాశం ఉందని తెలిపారు. గతంలో కేసులు పెరిగిన విధానం గురించి వివరించారు. ఒక వేరియంట్ పుట్టి వ్యాప్తి చెందే సరికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని చెప్పారు. స్థానికంగా కూడా కోవిడ్ మరణాలు లేవని అన్నారు.