Begin typing your search above and press return to search.

భారత్ లో కొత్తతరహా ఉగ్రవాదం ?

By:  Tupaki Desk   |   2 Aug 2021 6:35 AM GMT
భారత్ లో కొత్తతరహా ఉగ్రవాదం ?
X
భారతీయ యువతను పాకిస్ధాన్ ఉగ్రవాదులుగా మారుస్తోందా ? అవుననే నిఘా వ్యవస్ధలోని ఉన్నతాధికారులు సమాధానం చెబుతున్నారు. భారతీయులను పాకిస్ధాన్ ఎప్పటినుండో ఉగ్రవాదులుగా మారుస్తోంది కదా ఇపుడు కొత్తేంది అనే అమనుమానం రావచ్చు. కానీ ఇపుడు జరుగుతున్నది కొత్త తరహా విధానం. అదేమిటంటే ప్రపంచంలోని అనేక దేశాల మధ్య యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లు జరుగుతుంటాయి. అంటే ఒకదేశంలోని యువత మరోదేశంలో చదువుకోవటం.

ఇలాంటి ప్రోగ్రామ్ ను అడ్డం పెట్టుకుని పాకిస్ధాన్ లోని ఉగ్రవాద సంస్ధల అధినేతలు జమ్మూ-కాశ్మీర్ లోని యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్నారట. అంటే జమ్మూలోని యువకులు పాకిస్ధాన్, బంగ్లాదేశ్ లో చదువుకోవటం కోసం వెళుతున్నారట. అధికారికంగానే అంటే యువకులు పాస్ పోర్టు సంపాదించుకుని వీసీలు తీసుకునే పాకిస్ధాన్, బంగ్లాదేశ్ కు వెళుతున్నారట.

మామూలుగా ఉన్నత చదవులు చదువుకోవాలనుకునే యువత పాకిస్ధాన్, బంగ్లాదేశ్ కు వెళ్ళటానికి ఇష్టపడరు. ఎందుకంటే ఈ దేశాలకన్నా మన దేశమే ఎంతో మెరుగైన స్ధితిలో ఉంది. అలాంటిది గడచిన ఏడేళ్ళుగా హిమాలయ రాష్ట్రం నుండి ఎక్కువమంది యువత పై రెండు దేశాలకు ఎక్కువగా వెళుతున్నారట. మరి అక్కడకు వెళ్ళిన తర్వాత వాళ్ళేమి చదువుతున్నారో తెలీదు కానీ ఉగ్రవాదంలో మాత్రం పూర్తిస్ధాయి శిక్షణ తీసుకుంటున్నట్లు తేలింది.

ఈ మధ్య జమ్మూలో జరిగిన ఎన్ కౌంటర్లో షాకీర్ అల్తాఫ్ భట్ అనే కరుడుగట్టిన ఉగ్రవాది చనిపోయాడు. ఇతని బ్యాక్ గ్రౌండ్ చూసినపుడు 2018లో ఉన్నతచదువులకని పాకిస్ధాన్ వెళ్ళినట్లు తేలింది. అంటే అక్కడ ఉగ్రవాద కార్యకలాపాల్లో బాగా శిక్షణ తీసుకుని తిరిగి ఇండియాకు వచ్చినట్లు అర్ధమైపోయింది. ఇలాంటి ఘటనలే మరకొన్ని బయటపడ్డాయి. వారి నేపధ్యం కూడా పాస్ పోర్టు, వీసీలు తీసుకుని ఉన్నతచదవుల కోసమని పాకిస్ధాన్ వెళ్ళినట్లు బయటపడింది.

గడచిన మూడేళ్ళల్లో పాకిస్ధాన్ కు 100 మందికి పైగా యువకులు వెళ్ళినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. అందుకనే 2015 నుండి జమ్మూ-కాశ్మీర్ లో జారీచేసిన పాస్ పోర్టులపై ఇపుడు నిఘావర్గాలు దర్యాప్తు మొదలుపెట్టాయి. 40 మంది యువకులు ఉగ్రవాదులు ట్రైనింగ్ తీసుకుని తిరిగా భారత్ కు చేరుకున్నట్లు అనుమానిస్తున్నారు. అధికారికంగా పాకిస్ధాన్, బంగ్లాదేశ్ నుండి భారత్ కు తిరిగి రాలేదంటే అనధికారికంగా ప్రవేశించి ఉంటారని అనుమానిస్తున్నారు. మరి ఈ పద్దతికి భారత్ ఎలా అడ్డుకట్టవేస్తుందో చూడాల్సిందే.