Begin typing your search above and press return to search.

హైకోర్టుకు కోడెల కుమార్తె.. ట్విస్ట్ ఇదే..

By:  Tupaki Desk   |   13 July 2019 4:20 PM IST
హైకోర్టుకు కోడెల కుమార్తె.. ట్విస్ట్ ఇదే..
X
కే ట్యాక్స్ పేరుతో టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సత్తెనపల్లి - నరసారావు పేట నియోజకవర్గాల కేంద్రంగా సాగించిన వసూళ్ల దందాపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. వైసీపీ అధికారంలోకి రాగానే బాధితులంతా వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. లక్షలకు లక్షలు తమ వద్ద కొల్లగొట్టారని కోడెల సహా ఆయన కుమారుడు, కుమార్తెపై పోలీస్ కేసులు పెట్టారు.

అయితే అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన కోడెల కుమారుడు, కుమార్తెలు ఎక్కడున్నారన్నది పోలీసులకు అంతు చిక్కడం లేదు. తాజాగా కోడెల కుమార్తె విజయలక్ష్మీ తనను మోసం చేసిందంటూ నరసరావుపేటకు చెందిన బుజ్జి వెంకాయమ్మ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విజయలక్ష్మీపై చీటింగ్ కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను పోలీసులు నమోదు చేశారు.

ఈ కేసు తీవ్రంగా ఇరకాటం పెట్టడంతో తాజాగా కోడెల కుమార్తె విజయలక్ష్మీ ఏపీ హైకోర్టును శనివారం మధ్యాహ్నం ఆశ్రయించారు.

ఈ కేసులో విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. 2014లో సివిల్ భూ తగాదా విషయంలో ఇప్పుడు ఫిర్యాదు చేయడం.. కేసు పెట్టడం రాజకీయ ప్రేరేపితం అని ఆమె వాదించింది. మొత్తం ఎనిమిది మంది నిందితులుంటే తనపై కేసు పెట్టారని పేర్కొన్నారు. దీంతో తీర్పును ధర్మాసనం రిజర్వులో ఉంచింది. కోడెల కుమార్తెకు తీర్పులో ఏం వెలువడుతుందనేది హాట్ టాపిక్ గా మారింది.