Begin typing your search above and press return to search.

జ‌య‌రాం హ‌త్య‌.. ఏపీలో కొత్త స‌మ‌స్య‌...శిఖాయే కార‌ణ‌మా?

By:  Tupaki Desk   |   10 Feb 2019 7:15 AM GMT
జ‌య‌రాం హ‌త్య‌.. ఏపీలో కొత్త స‌మ‌స్య‌...శిఖాయే కార‌ణ‌మా?
X
పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డిని నందిగామ సబ్‌జైలు నుంచి పిటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొనిరావడం ఆలస్యమవుతున్నది. శనివారం నందిగామ కోర్టుకు వెళ్లిన హైదరాబాద్ పోలీసులకు నిరాశే ఎదురైంది. అక్కడి న్యాయమూర్తి సెలవుపై ఉండటంతో జగ్గయ్యపేటలోని ఇంచార్జి న్యాయమూర్తిని ఆశ్రయించారు. కొన్నిపత్రాలు లేకపోవడంతో పిటీ వారెంట్ ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరిస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చారు. దీంతో సోమవారం నందిగామ కోర్టును ఆశ్రయించనున్నారు. మ‌రోవైపు ఈ కేసులో నాలుగు కోట్ల రూపాయ‌ల అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

జయరాం మర్డర్ కేసులో అంతుచిక్కని చిక్కుముడులు చాలా కనిపిస్తున్నాయి. ఈ కేసు విషయమై పోలీసులు జయరాం భార్య పద్మశ్రీ స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శిఖా చౌదరి మాత్రం మామయ్య హత్యతో ఎలాంటి సంబంధం చెప్తున్న సంగ‌తి తెలిసిందే. శిఖా చెప్పేవన్నీ అబద్దాలే అని కొట్టి పారేశారు. కేవలం నాలుగున్నర కోట్లు వసూలు చేసుకునే క్రమంలోనే ఈ హత్య జరిగినట్లు వస్తున్న వార్తలను కూడా పద్మశ్రీ కొట్టి పారేశారు. "మాకు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉండగా, ఎందుకు అప్పు తీసుకున్నారనేది అర్ధం కావటం లేదు` అని పద్మశ్రీ అన్నారు. నాకు న్యాయం ఏ రాష్ట్రం చేస్తుందో అర్థం కావటం లేదన్నారు. కేవలం రెండు రోజులు ఇన్వెస్టిగేషన్ చేసి కేసు మూసేస్తారా అని ప్రశ్నించారు. విచారణ తీరుపైనా అనుమానం వ్యక్తం చేశారు. జయరాంను శిఖా చౌదరి జలగ లాగా రక్తం పిండేసి వదిలేసిందని ఆరోపించారు. సొంత మేనకోడలు ఈ విధంగా చేయటం బాధగా ఉందన్నారు. మొదటి నుంచి శిఖ తీరుపై బాగుండేది కాదన్నారామె. శిఖా చెప్పే మాటలు అనుమానం కలిగిస్తున్నాయని, జయరాంను మర్డర్ చేసి ఆయన ఫోన్ నుంచి నాకు మెసేజ్ లు చేశారని పద్మశ్రీ ఆరోపించారు. శిఖాకు డబ్బు పిచ్చి ఎక్కువని, ఎక్స్ ప్రెస్ టీవీ, ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఆమె ఎంటరైన తర్వాతే నష్టాల్లోకి వెళ్లాయని పద్మశ్రీ అంటున్నారు. శిఖా తల్లి మమల్ని చాలా బాధలు పెట్టిందని పద్మశ్రీ చెప్పారు. శిఖానే.. రాకేష్ రెడ్డిని ప్రేరేపించి ఈ పన్నాగం పన్నిందని ఆమె ఆరోపించారు. ఇంతవరకు ఫోరెన్సిక్ రిపోర్టు రాలేదని, జయరాంకు విషమిచ్చి చంపి ఉంటారనే అనుమానం పద్మశ్రీ వ్యక్తం చేశారు.

కాగా, జయరాం హత్యకు ప్రధాన కారణంగా చెబుతున్న రూ.4 కోట్లకు పైగా డబ్బులు ఎవరివి అనే అంశం కీలకంగా మారింది. ఇదే స‌మ‌యంలో, జ‌యరాంను తన ట్రాప్‌లో పడేసేందుకు రాకేష్ రెడ్డి `వీణ‌` అనే అమ్మాయి పేరుతో చాటింగ్ చేశాడు. వీణ‌ పేరునే జయరాంతో చాటింగ్ చేసేందుకు ఎందుకు ఎంచుకోవ‌డం ఎందుకు? ఆ పేరు ఉన్న మహిళతో ఎవరితోనైనా జ‌య‌రాంకు పరిచయాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. కాగా, రాకేష్‌ను క‌స్ట‌డీకి తీసుకొని విచార‌ణ చేసిన త‌ర్వాత‌, అదే స‌మ‌యంలో శిఖాను విచారించిన త‌దుప‌రి పూర్తి స్ప‌ష్ట‌త రానున్న‌ట్లు తెలుస్తోంది.