Begin typing your search above and press return to search.

హాథ్రస్ అత్యాచారం కేసులో కొత్త మలుపు.. చిక్కుల్లో యోగి సర్కార్

By:  Tupaki Desk   |   5 Oct 2020 1:20 PM IST
హాథ్రస్ అత్యాచారం కేసులో కొత్త మలుపు.. చిక్కుల్లో యోగి సర్కార్
X
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన హాథ్రస్ గ్యాంగ్ రేప్ ఉదంతంలో షాకింగ్ నిజం బయటకు వచ్చింది. ఈ అత్యాచార కేసు కొత్త మలుపు తిరటమే కాదు.. యూపీలోని యోగి సర్కారుకు కొత్త సమస్యను తెచ్చి పెట్టిందని చెప్పాలి. బాధితురాలు గ్యాంగ్ రేప్ నకు గురైనట్లు చెప్పిన వీడియో ఉండగా.. అసలు అలాంటిదేమీ జరగలేదని యూపీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు చెబుతున్న మాటలన్ని అబద్ధాలేనన్న విషయం తాజాగా బయటకువచ్చింది.

సదరు మైనర్ బాలిక చికిత్స పొందిన అలీగఢ్ లోని జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆసుపత్రి తాజాగా తన నివేదికను విడుదల చేసింది. ఇందులో స్పెర్మ్ ఆనవాల్లు కనిపించలేదని చెప్పింది.ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికను అనుసరించి తాము తుది నివేదిక ఇచ్చినట్లుగా చెప్పిన ఆసుపత్రి.. మరేం విషయాల్ని వెల్లడించిందన్నది తాజాగా ది వైర్ వెబ్ సైట్ పబ్లిష్ చేసింది.

బాధితురాలిపై సెప్టెంబరు 14న లైంగిక దాడితో పాటు భౌతిక దాడి జరిగింది. ఆమెను జవహర్ లాల్ నెహ్రు ఆసుపత్రికి తీసుకొచ్చారు. మెడికో లీగల్ కేసుగా నమోదు చేశారు. పరిస్థితి విషమించటంతో మెజిస్ట్రేట్ ను పిలిచారు. ఆ సందర్భంగా ఆ యువతి తనను నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేసినట్లు చెప్పటంతో పాటు.. వారి పేర్లను ఆమె వెల్లడించారు. తనపై రేప్ జరిగినట్లు వైద్యులకు సైతం ఆ యువతి చెప్పింది. అందుకుతగ్గట్లే.. ఆమె యోని పరీక్షించిన వైద్యుడు కూడా చెప్పారు.

నిబంధనల ప్రకారం రేప్ జరిగిన కేసుకు సంబంధించిన అంశాన్ని ధ్రువీకరించాలంటే.. సదరు ఆసుపత్రి స్థాయి అవసరం. అది లేనప్పుడు వ్యక్తిగత స్థాయిలో అత్యాచారం జరిగిందని వెల్లడించకూడదు. దీంతో.. మెడికల్ కాలేజీ వైద్యులు తమ అభిప్రాయాన్ని వెల్లడించలేదని వైర్ పేర్కొంది. ఆగ్రాలోని ల్యాబ్ కు చెందిన నిపుణులు సెప్టెంబరు 25న మెడికల్ కాలేజికి వచ్చి రక్త నమూనాల్ని.. స్వాబ్ శాంపిల్స్ ను తీసుకెళ్లారు.

అయితే.. ఇదంతా అత్యాచారం జరిగిన పదకొండు రోజుల తర్వాత జరిగింది. సాధారణంగా రేప్ జరిగిన నాలుగు రోజుల పాటు ఆ ఆనవాళ్లు ఉంటాయి తప్పించి.. పది రోజులైన తర్వాత ఉండవు. సాధారణంగా స్పెర్మ్ జీవితకాలం 72 గంటలు మాత్రమే. ఫోరెన్సిక్ నిపుణులు పదకొండు రోజుల తర్వాత పరీక్షలు జరిపితే స్పెర్మ్ జాడలు ఎక్కడ కనిపిస్తాయి? అన్న ప్రశ్నను వేస్తున్నారు. ఈ వాదనతో ఇప్పటివరకు రేప్ జరగలేదని పేర్కొన్న అధికారులు.. వారికి మద్దతుగా నిలిచిన యోగి సర్కారుకు కొత్త చిక్కు ఎదురైనట్లుగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం మరింత ముదురుతుందన్న మాట వినిపిస్తోంది.