Begin typing your search above and press return to search.

జిల్లాల వారీగా గులాబీ 'కారు'కు కొత్త సారథులు వచ్చేశారోచ్!

By:  Tupaki Desk   |   26 Jan 2022 8:45 AM GMT
జిల్లాల వారీగా గులాబీ కారుకు కొత్త సారథులు వచ్చేశారోచ్!
X
రాజకీయ పార్టీ ఏర్పాటు చేయటం ఒక ఎత్తు అయితే.. దాన్ని క్రమపద్ధతిలో పెంచటం మరో ఎత్తు. అధికారంలో ఉన్నప్పుడు వెలిగిపోవటం.. లేనప్పుడు చతికిలపడటం కాకుండా పంచాయితీల స్థాయి నుంచి రాష్ట్రా స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని పక్కాగా చేపట్టటం అంత తేలికైన విషయం కాదు. అధికారంలోకి వచ్చి దాదాపు ఏడున్నరేళ్లు దాటినా పార్టీ నిర్మాణం విషయంలో ఎలాంటి శ్రద్ధ చూపించకపోవటం గులాబీ బాస్ కేసీఆర్ కే చెల్లుతుంది. మరేమైందోకానీ.. ఉన్నట్లుండి ఒక్కసారిగా యాక్టివ్ అయిన పెద్ద సారు తాజాగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా సారథుల్ని ప్రకటించారు.

గణతంత్ర దినోత్సవం రోజు విడుదల చేసిన కారు కొత్త సారథులను చూస్తే.. చురుగ్గా ఉన్న నేతలకు బాధ్యతల్ని అప్పజెప్పినట్లుగా కనిపిస్తోంది. ఇక.. గ్రేటర్ హైదరాబాద్ కు పార్టీ సారధికి బదులుగా హైదరాబాద్ జిల్లా, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలకు వేర్వేరుగా అధ్యక్షుల్ని నియమించటం ద్వారా పాత విధానానికి చెల్లుచీటి ఇచ్చారు. మొత్తం 33 మంది జిల్లా అధ్యక్షుల్లో ముగ్గురు మహిళలకు మాత్రం సారథ్య బాధ్యతలు లభించాయి. జిల్లాల వారీగా టీఆర్ఎస్ కొత్త సారథుల్ని చూస్తే..

క్ర.స జిల్లా పేరు

01 అదిలాబాద్ జోగు రామన్న (ఎమ్మెల్యే)
02 కొమరంభీమ్ ఆసిఫాబాద్ కొనేరు కోనప్ప (ఎమ్మెల్యే)
03 మంచిర్యాల బాల్క సుమన్ (ఎమ్మెల్యే)
04 నిర్మల్ జి. విఠల్ రెడ్డి (ఎమ్మెల్యే)
05 నిజామాబాద్ ఏ. జీవన్ రెడ్డి (ఎమ్మెల్యే)
06 కామారెడ్డి ఎంకే ముజీబుద్దీన్
07 కరీంనగర్ జి.వి.రామక్రిష్ణారెడ్డి
08 రాజన్న సిరిసిల్ల తోట ఆగయ్య
09 జగిత్యాల కె. విద్యాసాగర్ రావు (ఎమ్మెల్యే)
10 పెద్దపల్లి కోరుకంటి చందర్ (ఎమ్మెల్యే)
11 మెదక్ ఎం. పద్మాదేవందర్ రెడ్డి (ఎమ్మెల్యే)
12 సంగారెడ్డి చింతా ప్రభాకర్ (మాజీ ఎమ్మెల్యే)
13 సిద్ధిపేట కొత్త ప్రభాకర్ రెడ్డి (ఎంపీ)
14 వరంగల్ ఆరూరి రమేశ్ (ఎమ్మెల్యే)
15 హన్ముకొండ దాస్యం వినయ్ భాస్కర్ (ఎమ్మెల్యే)
16 జనగామ పి. సంపత్ రెడ్డి (జెడ్పీ ఛైర్మన్)
17 మహబూబాబాద్ మాలోతు కవిత నాయక్ (ఎంపీ)
18 ములుగు కుసుమ జగదీశ్ (జెడ్పీ ఛైర్మన్)
19 జయశంకర్ భూపాలపల్లి గండ్ర జ్యోతి (జెడ్పీ ఛైర్మన్)
20 ఖమ్మం తాతా మధుసూదన్ (ఎమ్మెల్సీ)
21 భద్రాద్రి కొత్తగూడెం రేగా కాంతారావు (ఎమ్మెల్యే)
22 నల్గొండ రమావత్ రవీంద్ర కుమార్ (ఎమ్మెల్యే)
23 సూర్యాపేట బడుగుల లింగయ్య యాదవ్ (ఎంపీ)
24 యాదాద్రి భువనగిరి కంచర్ల రామక్రిష్ణారెడ్డి
25 రంగారెడ్డి మంచిరెడ్డి కిషన్ రెడ్డి
26 వికారాబాద్ మెతుకు ఆనంద్ (ఎమ్మెల్యే)
27 మేడ్చల్ శంభీపూర్ రాజు (ఎమ్మెల్సీ)
28 మహబూబ్ నగర్ సి. లక్ష్మారెడ్డి (ఎమ్మెల్యే)
29 నాగర్ కర్నూల్ గువ్వల బాలరాజు (ఎమ్మెల్యే)
30 జోగులాంబ గద్వాల బి. క్రిష్ణమోహన్ రెడ్డి (ఎమ్మెల్యే)
31 నారాయణపేట ఎస్. రాజేందర్ రెడ్డి (ఎమ్మెల్యే)
32 వనపర్తి ఏర్పుల గట్టు యాదవ్
33 హైదరాబాద్ మాగంటి గోపినాథ్ (ఎమ్మెల్యే)