Begin typing your search above and press return to search.
ఏపీలో న్యూట్రెండ్.. 2,199 సర్పంచులు, 48,022 వార్డు సభ్యుల ఏకగ్రీవం
By: Tupaki Desk | 6 Sept 2021 9:00 PM ISTసాధారణంగా.. ఏ చిన్న పదవి వరిస్తుందని తెలిసినా.. వెంటనే పోటీపడతారు. మాకు పదవి కావాలంటే.. మాకే కావాలంటూ.. పట్టుబడతారు. కానీ, గత మార్చిలో జరిగిన స్థానిక ఎన్నికల సమరంలో మాత్రం గ్రామాలు.. చాలా ఆదర్శంగా నిలచాయి. పోటీకి స్వస్థి పలికి.. ఏకగ్రీవాలవైపు మొగ్గు చూపాయి. ఇలా ఒకటి రెండు కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల విషయంలో సరికొత్త ట్రెండ్ నమోదైంది. తాజాగా పంచాయతిరాజ్ శాఖ వెలువరించిన గణాంకాల ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా 2,199 సర్పంచులు, 48,022 వార్డు సభ్యుల ఏకగ్రీవం కావడం.. గ్రామ రాజకీయాల్లో మారుతున్న ట్రెండ్‌ను స్పష్టం చేస్తోందని అంటున్నారు పరిశీలకులు.
వివాదాలకు దూరంగా
గుంటూరు జిల్లా నిజాంపట్నం మండల కేంద్రంలో అత్యధికంగా మత్స్యకార కుటుంబాలే నివశిస్తుంటాయి. ఆ గ్రామంలో దాదాపు 19 వేల జనాభా ఉంది. ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరి నెలల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ గ్రామంలో ఉండే 18 వార్డు సభ్యులతో పాటు సర్పంచి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికలు ముగిశాయి. ఇలా రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు ఈ పరిణామం అద్దం పట్టింది. పదివేలకుపైగా జనాభా ఉండే 11 పెద్ద గ్రామాల్లో సైతం ప్రజలు ఒకే పక్షా న ఉంటూ మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో మొత్తం వార్డు సభ్యులతోపాటు సర్పంచిని ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. ఇది కూడా ఎలాంటివివాదాలకు తావులేకుండా సాగిపోవడం గమనార్హం.
రాష్ట్రంలో ఇదే రికార్డ్!
రాష్ట్రంలో మొత్తం 13,095 పంచాయతీల్లో సర్పంచుల పదవులతోపాటు దాదాపు 1.31 లక్షల వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగితే.. అందులో 2,199 సర్పంచి పదవులకు, 48,022 వార్డు సభ్యులకు ఏకగ్రీవం గా ఎన్నికలు జరిగాయి. అయితే 2001 గ్రామాల్లో సర్పంచి, వార్డు సభ్యుల పదవులన్నింటికీ ఏకగ్రీ వంగా ఎన్నికలు ముగిశాయి. బీసీల జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాల్లోనే ఎక్కువశాతం పదవులు ఏకగ్రీవమయ్యాయి. అంతేకాదు, రెండు వేలు, అంతకంటే తక్కువ జనాభా ఉన్న చిన్న గ్రామాల్లో అత్యధికంగా సర్పంచి, వార్డు సభ్యుల పదవులన్నింటికీ ఏకగ్రీవంగా ఎన్నికలు ముగిశాయి. రెండు వేలు, అంతకు తక్కువ జనాభా ఉండే గ్రామాల్లో 1,401 చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగినట్టు నిర్ధారించారు. ఇప్పటి వరకు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఈ తరహా ఫలితం రావడం.. ఇలా అన్నీ ఏకగ్రీవం కావడం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొంటున్నారు.