Begin typing your search above and press return to search.
సిటీ ఎమ్మెల్యేలకు కొత్త టార్గెట్.. భారంగా మారిన బహిరంగ సభ
By: Tupaki Desk | 27 Nov 2020 11:30 AM ISTహైదరాబాద్ నగర ఎమ్మెల్యేలకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని.. తుది ఫలితం ఎమ్మెల్యేల పనితీరుకు గీటురాయిగా నిర్దేశించిన అధినాయకత్వం మాటకు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. ఇది సరిపోదన్నట్లుగా.. మంత్రి కేటీఆర్ రోడ్డు షోకు.. భారీగా జనం హాజరయ్యేట్లుగా చేస్తున్న ప్రయత్నాలు అన్నిఇన్ని కావు. అంతకు ముందు జరిగిన సభలకు మించిపోయేలా జనం విరగబడాలనే సందేశం.. సదరు ఎమ్మెల్యేలకు సమస్యగా మారుతోందని చెబుతున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో జన సమీకరణ పెద్ద సమస్యగా మారినట్లుగా తెలుస్తోంది. దీనికి తోడు ఖర్చు తడిసిమోపెడు అవుతున్నట్లుగా చెబుతున్నారు. రోడ్ షోల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసినప్పటికి.. పడాల్సిన భారం పడుతున్నట్లుగా వాపోతున్నారు. ఇది సరిపోదన్నట్లుగా రేపు (శనివారం) ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు అదిరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నా.. బీజేపీ జోరు ముందు వెలవెలపోతున్నట్లుగా వస్తున్న నివేదిక గులాబీదళంలో కొత్త గుబులుకు కారణమవుతోంది.
ఇది చాలదననట్లుగా సీఎం బహిరంగ సభకు జన సమీకరణ బాధ్యతను నగర ఎమ్మెల్యేల మీద వేసినట్లుగా చెబుతున్నారు. టార్గెట్లు పెట్టి మరీ జనాల్ని తరలించాల్సిందిగా చెప్పటంతో ఉరుకులు పరుగులు తీయాల్సి వస్తోందని చెబుతున్నారు. ఓవైపు ప్రచారం.. మరోవైపు రోడ్ షోలు.. ఇవి సరిపోవన్నట్లుగా ఇప్పుడు బహిరంగ సభ.. అంటూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జనసమీకరణ అలవాటైన విషయమే కానీ.. కొందరు ఉత్సాహవంతులైన ఎమ్మెల్యేలు చేపట్టే చర్యలు.. మిగిలిన వారి ఇబ్బందిగా మారతాయంటున్నారు.
అధినాయకత్వాన్ని ఇంప్రెస్ చేసేందుకు కొందరు ఎమ్మెల్యేలు చేసే పనులు.. మిగిలిన వారెందుకు చేయలేకపోతున్నారన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. సీఎం బహిరంగ సభ ఏమో కానీ.. హైదరాబాద్ నగర టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాత్రం కొత్త సవాలు విసురుతున్నదని చెబుతున్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా.. చోటు చేసుకునే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెబుతూ.. వణుకుతున్న పరిస్థితి.