Begin typing your search above and press return to search.

ఆఫ్రికాలో కొత్త కరోనా.. నైజీరికాకు పాకింది

By:  Tupaki Desk   |   24 Dec 2020 3:28 PM GMT
ఆఫ్రికాలో కొత్త కరోనా.. నైజీరికాకు పాకింది
X
కరోనా వైరస్ మళ్లీ కొత్తగా రూపు మార్చుకొని ప్రపంచాన్ని భయపెడుతోంది. ఆఫ్రికా దేశంలో పుట్టుకొచ్చిన ఈ కొత్త వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు పాకుతూ అందరినీ బెంబేలెత్తిస్తోంది. మరోసారి అంతుచిక్కకుండా ప్రజల ప్రాణాలు తీస్తోంది.

ఇప్పటికే బ్రిటన్, దక్షిణాఫ్రికాల్లో కొత్త రకం కేసులు వందలాదిగా బయటపడగా.. తాజాగా ఆఫ్రికా దేశమైన నైజీరియాలోనూ మరో రకం కరోనా వైరస్ ను గుర్తించారు. దీనిపై లోతైన పరిశోధనలు చేయాల్సి ఉందని అక్కడి అధికారులు తెలిపారు.

కరోనాలో మరో కొత్త రకాన్ని ఆఫ్రికాలో గుర్తించారు. ఇది యూకే, దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన దానికంటే డేంజర్ గా ఉందని దక్షిణాఫ్రికా సెంటర్స్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ హెడ్ జాన్ కెంగాసాంగ్ తెలిపారు. వైరస్ జన్యుమార్పిడి జరిగిందని నైజీరియా శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ దేశంలోని రోగుల్లో టెస్ట్ చేయగా ఈ వైరస్ కొత్తగా రూపు మార్చిందని తెలిపారు.

ఇప్పటికే బ్రిటన్, దక్షిణాఫ్రికాల్లో ఈ జన్యుమార్పిడి వైరస్ కేసులు బయటపడిన సంగతి తెలిసిందే. అక్కడ 70శాతం కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇప్పుడు నైజీరియాలోనూ పాకడం ఆందోళన కలిగిస్తోంది.