Begin typing your search above and press return to search.
వెలుగులోకి వస్తున్న మాల్యా వారసులు
By: Tupaki Desk | 19 Feb 2018 12:46 PM ISTదేశంలో లిక్కర్ కింగ్ విజయ్ మాల్య వారసులు ఎక్కువైపోయారు. అందిన కాడికి కోట్లలో రుణాలు తీసుకొని దేశానికి టోకరా పెట్టడం. ఆపై విదేశాలకు చెక్కేసి దర్జాగా విలసావంతమైన జీవితాన్ని గడుపుతుండడం విశేషం. సమాజంలో అత్యున్నత హోదాలో ఉంటూ ఇలా బ్యాంకుల్లో కోట్లాది రూపాయల్ని కుంభకోణాలకు పాల్పడడం దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బ దీస్తుంది.
ఈ ఏడాది ప్రారంభం నుంచి కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ యజమాని నీరవ్ మోడీ ప్రభుత్వం బ్యాంకుల్లో రెండో స్థానంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ. 11,400కోట్ల అక్రమాలకు పాల్పడిన విషయం తెలిసిందే. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఈ బ్యాంకుల్లో ‘లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ తో ఈ మోసానికి తెరదించాడు. ఈ మోసం వెలుగులోకి రావడంతో నీరవ్ భారత్ నుంచి విదేశాలకు చెక్కేశాడు. అంతేకాదు నీరవ్ తన పరపతిని అడ్డుపెట్టుకొని యూకో బ్యాంక్ (యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్)లో రూ. 2636కోట్లకు మోసానికి పాల్పడ్డాడు. తాజాగా ఈ ఉదంతం భయటపడడంతో యూకో బ్యాంక్ కంగుతిన్నది. హాంకాంగ్ - పీఎన్ బీ నుంచి వచ్చిన లెటర్ ఆఫ్ క్రెడిట్ డాక్యుమెంట్ ను - స్విఫ్ట్ మెసేజ్ ను పరిశీలించగా నీరవ్ మోదీ - ఛోక్సీల కంపెనీలు యూకో బ్యాంకులో సుమారు 411.82 మిలియన్ డాలర్ల (రూ 2636 కోట్ల) మేర రుణాలు తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. .
ఇప్పటిదాకా పీఎన్ బీ జారీ చేసిన ఎల్ ఓయూల వల్ల అలహాబాద్ బ్యాంకు ($336.87 మిలియన్లు) - యూనియన్ బ్యాంకు($300 మిలియన్లు) మాత్రమే నష్టపోయాయని భావిస్తున్న కేంద్రానికి యూకో బ్యాంక్ సమాచారంతో మరో షాక్ తగిలింది.
నీరవ్ మోడీ మోసం మరవకముందే అదే తరహా మోసం మరొకటి వెలుగులోకి వచ్చింది. పీఎన్బీతో పాటు పలు ప్రభుత్వ రంగం సంస్థల్లో అవకతవకలకు పాల్పడి ప్రముఖ రొటొమాక్ పెన్నుల కంపెనీ మాతృసంస్థ భారత్‌లోని వివిధ బ్యాంకుల్లో రూ.800 కోట్ల రుణాలు తీసుకొని ఎగనామం పెట్టినట్లు సమాచారం.
ఫార్మసి రంగంలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ర్యాన్ బ్యాక్సీ సంస్థ మాజీ సీఈఓ - ఫొర్టిస్ హెల్త్ కేర్ సహ వ్యవస్థాపకుడు మాల్వీందర్ మోహన్ సింగ్ రూ.800కోట్ల రుణాలు తీసుకొని ఎగనామం పెట్టాడు. ఏడాది క్రితం ఫొర్టిస్ హెల్త్ కేర్ పాలక మండలి ఆమోదం లేకుండానే డైరెక్టర్ పదవులకు రాజీనామా చేసిన మాల్విందర్ మోహన్ సింగ్ సోదరులను ఈ నెల 26న అఫిడవిట్ సమర్పించాలని సెబీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మాల్వీందర్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీలోని లుట్యెన్స్ - ఇతర విలాసవంతమైన ఆస్తులను హామీగా పెట్టిన మాల్వీందర్ ‘ఎస్ బ్యాంక్ 'లో ఆస్కార్ ఇన్వెస్ట్ మెంట్ లిమిటెడ్ అనే సంస్థ తీసుకున్న రూ.569.64 కోట్ల రుణం పొందాడు. వాటిని చెల్లించకుండానే తన ఆస్థుల్ని అమ్మకానికి పెట్టేందుకు ప్రయత్నించగా ఢిల్లీ రుణాల రికవరీ ట్రిబ్యునల్ అడ్డుకుంది. దీన్ని ప్రిసైడింగ్ అధికారి జీవీకే రాజు సారథ్యంలోని డీఆర్టీ బెంచ్ విచారించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎటువంటి ఆస్తులు అమ్మకూడదంటూ ఆదేశించింది.
రొటొమాక్ కంపెనీ యజమాని విక్రమ్ కొఠారి అలహాబాద్ బ్యాంకు - బ్యాంక్ ఆఫ్ బరోడా - ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు - యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు నిబంధనలకు విరుద్ధంగా రూ.800కోట్ల మేర రుణాలు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. కొఠారి యూనియన్ బ్యాంకు నుంచి రూ.485 కోట్లు - అలహాబాద్ నుంచి రూ.352 కోట్ల రుణం తీసుకున్నారు. వాటికి ఎటువంటి వడ్డీలు - తీసుకున్నమొత్తాన్ని చెల్లించలేదు. ఆయన ఇప్పటివరకూ అసలును కానీ, వడ్డీని కానీ బ్యాంకులకు తిరిగి చెల్లించనట్లు తెలుస్తోంది.
2017 ఫిబ్రవరిలో అలహాబాద్ హైకోర్టు రొటొమ్యాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ ను ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారు'(విల్ పుల్ డిఫాల్టర్)గా ప్రకటించింది.
అయితే తన కంపెనీని డిఫాల్టర్ జాబితా కింద తొలగించాలని - అందుకుగాను రూ. 300కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్ననంటూ కొఠారి ప్రకటించాడు.
ఈ నేపథ్యంలో రూ.800కోట్లు తీసుకొని దేశం పారిపోయాడని వార్తలు వచ్చాయి . గత కొద్దిరోజులుగా కాన్పూరులో ఉన్న విక్రం కొఠారి కార్యాలయం మూతపడి ఉంది. దీంతో స్థానిక మీడియాలో కొఠారి దేశం వదిలి పారిపోయాడని కథనాలు ప్రసారం చేసింది. అయితే ఈ వార్తలపై స్పందించిన కొఠాని తాను దేశం విడిచి వెళ్లలేదని - వ్యాపారాల నిమిత్తం విదేశాలకు వెళుతున్నట్లు చెప్పాడు. కాగా కొఠారి తీసుకున్న రుణం కింద అలహాబాద్ బ్యాంకు మేనేజర్ రాకేశ్ గుప్తా స్పందిస్తూ కొఠారి ఆస్తులు అమ్మి సొమ్మును రికవరీ చేస్తామని తెలిపారు.