Begin typing your search above and press return to search.

అమెరికా వెళ్లాలంటే 500 రోజులు ఆగాలి..: ఎందుకంటే..?

By:  Tupaki Desk   |   19 Aug 2022 8:47 AM GMT
అమెరికా వెళ్లాలంటే 500 రోజులు ఆగాలి..: ఎందుకంటే..?
X
జీవితంలో ఒక్కసారైనా అమెరికాను చూడాలనుకుంటారు కొందరు. తమ బంధువులో.. కుమారులో అమెరికాలో ఉంటే సరదాగా కాసేపు ఆ దేశంలో గడపడానికి ఉత్సాహ పడుతారు. అయితే అమెరికా వెళ్లాలంటే ఎంతో ప్రయాసపడాలి. ముఖ్యంగా విజిటింగ్ వీసా ఉంటేనే అమెరికాలో అడుగుపెట్టే అవకాశం ఉంది. అయితే ఈ విజిటింగ్ వీసా కోసం ఇప్పుడు నిరీక్షణ తప్పడం లేదు. ఆ వీసాను ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే దాదాపు సంవత్సరం తరువాత ఇంటర్వ్యూ ఉంటుంది. అమెరికాకు చెందిన ట్రావెల్. స్టేట్. జీవోవీ వెబ్ సైట్ ప్రకారం న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో విజిటింగ్ వీసా కోసం సగటున 522 రోజులు నిరీక్షణ చేయాలని తెలిపింది.

మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం విజిటింగ్ వీసాల ఇంటర్వ్యూ కోసం యూఎస్ కాన్సులేట్ వద్ద 4 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. కెనడా ఎంబసీ వద్ద 20 లక్షల దరఖాస్తులు వేచిచూస్తున్నాయి.

ఇక ఐరోపాకు వెళ్లేందుకు అవసరమైన షెన్ జెన్ వీసా కోసం మరింత కాలం వెయిట్ చేయక తప్పడం లేదు. ఫ్రాన్స్, ఐస్ లాండ్ దేశాలకైతే వీసా అపాయింట్మెంట్ స్లాట్ లే లేవని మనీ కంట్రోల్ సంస్థ వెల్లడించింది. అయితే ఇక నుంచి వీసా కోసం వెయిట్ చేసే సమయాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది.

ప్రస్తుతం ముంబైలో విజిటింగ్ వీసా కోసం 517రోజులు, స్టూడెంట్ వీసా కోసం 10 రోజులు వెయిట్ చేయాల్సి వస్తోంది. చెన్నైలో అయితే 557 రోజులు, నాన్ ఇమిగ్రెంట్ వీసాల కోసం 175 రోజులు ఆగాల్సి వస్తోంది.

ఇక హైదరాబాద్ లో దరఖాస్తు చేసుకున్నవారు 518 రోజలు ఆగాల్సి వస్తోంది. యూఎస్ ఎంబసీ లేదా కాన్సులేట్ ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ స్వీకరించడానికి వారానికోసారి మారవచ్చు. అయితే ఇవి కేవలం అంచనాలు మాత్రమేనని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ వెబ్ సైట్ తెలిపింది.

అమెరికా గత ఏడాది కంటే ఈ ఆర్థిక సంవత్సరం వీసాలను రెట్టింపు చేసింది. ఉద్యోగులతో సహా స్టూడెంట్ వీసాలను గణణీయంగా పెరుగుతోందని, అయితే తుది నిర్ణయం రాయబార కార్యాలయదేనని వీఎఫ్ఎస్ గ్లోబల్ తెలిపింది. మరోవైపు వీసాల జాప్యంతో కెనడా వెళ్లాలనుకునే విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇమ్మిగ్రేషన్ స్టాండింగ్ కమిటీ నివేదిక ప్రకారం గతేడాది భారత్ కు చెందిన 41 శాతం స్టడీ పర్మిట్ దరఖాస్తలు తిరస్కరించబడ్డాయి.