Begin typing your search above and press return to search.

ఐపీఎల్​ లో కొత్త రూల్స్.. ప్లేయర్స్​ కు వణుకు..

By:  Tupaki Desk   |   1 April 2021 9:46 AM GMT
ఐపీఎల్​ లో కొత్త రూల్స్.. ప్లేయర్స్​ కు వణుకు..
X
ఐపీఎల్​ సీజన్​ వచ్చేసిందంటే ఎంత హడావుడి ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రపంచంలోనే ఏ గేమ్​కు ఈస్థాయిలో క్రేజ్​ ఉండదంటే అతిశయోక్తి కాదేమో. దానికి సినీ గ్లామర్​ తోడై మరింత కలర్​ఫూల్​గా ఈ ఈవెంట్​ సాగుతోంది. ఐపీఎల్​ సీజన్​ ఎప్పుడెప్పుడు ప్రారంభవుతుందా? అని ప్రపంచవ్యాప్తంగా క్రికెట్​ అభిమానులు ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది కూడా త్వరలోనే ఐపీఎల్​ ప్రారంభం కాబోతున్నది. ఐపీఎల్​ టైంలో సినిమాలు విడుదల చేయాలంటే నిర్మాతలు కూడా భయపడతారు. కొన్ని ఎంటర్​ టైయిన్​మెంట్​ చానల్స్​ నిర్వాహకులు తమ షో టైమింగ్​ ను చేంజ్​ చేస్తుంటారు. ఐపీఎల్​ వచ్చే టైంలో కాకుండా మరోటైంలో తమ షోలను నిర్వహించుకుంటాయి చాలా చానల్స్. ఇది ఐపీఎల్​కు ఉన్న క్రేజ్​.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఐపీఎల్​ కొన్ని కొత్త రూల్స్​ తీసుకొచ్చింది. ఈ రూల్స్​ చూసి ఐపీఎల్​ ఆటగాళ్లు వణికిపోతున్నారట. ఏప్రిల్​ 9 నుంచి ఐపీఎల్​ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఇంతకీ ఆ రూల్స్​ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా ఐపీఎల్​లో అనేక మార్పులు తీసుకొచ్చారు. ఇక నుంచి ఎవరైనా ఓవర్​ వేయడానికి ఎక్కువ టైం తీసుకుంటే జట్టు కెప్టెన్​ మీద, సదరు బౌలర్​ మీద చర్యలు తీసుకోబోతున్నారు.

స్లో ఓవర్​రేటును తగ్గించేందుకు ఐపీఎల్​, బీసీసీఐ ఈ కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు కౌన్సిల్ కొన్ని రూల్స్​ తీసుకొచ్చింది. కొత్త రూల్స్​ ప్రకారం సాఫ్ట్​ సిగ్నల్​ అమల్లో ఉండదు.. ఆ విషయంపై టీవీ అంపైర్​ నిర్ణయమే ఫైనల్​. అంతేకాక ఒక ఇన్సింగ్స్​ ను 90 నిమిషాల్లోనే పూర్తి చేయాలి. అంతకు మించి టైం తీసుకున్నారంటే భారీ ఫైన్లు విధించబోతున్నారు. 90 నిమిషాల్లో ఇన్సింగ్స్​ ను పూర్తి చేయని జట్లపై కొన్ని కొత్త రూల్స్​ తీసుకొచ్చారు.

మొదటి సారి తప్పు జరిగితే సదరు జట్టు కెప్టెన్​కు రూ. 12 లక్షల జరిమానా విధించనున్నారు. రెండో సారి అదే రిపీట్​ అయితే కెప్టెన్​కు రూ. 24 లక్షలు జరిమానా విధించబోతున్నారు. అంతే కాక జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 6 లక్షలు జరిమానా లేదా ఫీజులో 25శాతం కోతం విధించబోతున్నారు. ఇక మూడోసారి ఇదే రిపీట్​ అయితే కెప్టెన్​ కు రూ. 30 లక్షల జరిమానాతో పాటు ఓ మ్యాచ్​కు నిషేధం విధించనున్నారు. అంతేకాక జట్టులోని ప్రతి సభ్యుడికి 50 శాతం ఫీజు కోత లేదా 12 లక్షలు జరిమానా విధించనున్నారు.