Begin typing your search above and press return to search.
గుడ్ న్యూస్: టెన్త్ పరీక్షలకు కొత్త రూల్స్
By: Tupaki Desk | 5 May 2020 10:45 AM ISTపదో తరగతి పరీక్షలు అలా మొదలై.. ఇలా ఆగిపోయాయి. కరోనా వైరస్ తో లాక్డౌన్ విధించడం.. వ్యాప్తి నివారణ కోసం విద్యార్థులకు ప్రభుత్వం సెలవులు ఇచ్చేసింది. దీంతో పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు? విద్యార్థులను డైరెక్ట్ గా పాస్ చేస్తారా? వారి భవితవ్యం ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇప్పటికే 9వ తరగతి వరకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రభుత్వం ప్రమోట్ చేసింది. ఇక పదోతరగతి పరీక్షలపై పీటముడి నెలకొంది. ఇప్పుడు దానిపై క్లారిటీ వచ్చింది.
లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత విద్యార్థుల చదువులను చక్కదిద్దాలని ఏపీ సర్కారు యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే వాయిదా పడిన పదోతరగతి పరీక్షలను నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కరోనా ప్రభావం ఉన్న నేపథ్యంలో సోషల్ డిస్టేన్స్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలను నిర్వహించడం పై కీలక నిర్ణయాలు తీసుకుంది.
పరీక్షల నిర్వహణ పై సమూల మార్పులు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఒక పరీక్ష హాలులో కేవలం 12మంది విద్యార్థులు మాత్రమే పరీక్ష రాసేలా చర్యలు చేపడుతోంది. విద్యార్థుల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండడం తో పాటు ప్రతి బెంచీపై ఒక విద్యార్థి మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.