Begin typing your search above and press return to search.

తిరుమలలో పెళ్లా.. చేసుకోవడం కష్టమే?

By:  Tupaki Desk   |   24 Nov 2019 7:14 AM GMT
తిరుమలలో పెళ్లా.. చేసుకోవడం కష్టమే?
X
తిరుమల.. కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన సన్నిధానం. ఇంతటి మహా పుణ్యక్షేత్రంలో పెళ్లి చేసుకోవాలని తపించే వారు ఎందరో.. ఇక ప్రేమించుకున్న వారు.. లవ్, అరేంజ్డ్ మ్యారేజిస్, లేచిపోయి వచ్చిన వారు.. పెళ్లి అయ్యి విడిపోయి వేరొకరితో వచ్చిన వారంతా తిరుమలలో పెళ్లి చేసుకొని కొత్త జీవితం ఆరంభిస్తారు. వారి అభిరుచికి అనుగణంగానే టీటీడీ తిరుమల కల్యాణ వేదికలో ఉచితంగా వివాహాలు జరిపిస్తుంటుంది.

అయితే ఇన్నాళ్లు ఒక లెక్క. ఇప్పుడో లెక్క. ముఖ్యంగా మొదటి భర్త/భార్య నుంచి విడాకులు తీసుకోకుండానే కొన్ని జంటలు లేచిపోయి వచ్చి తిరుమలలో రెండో పెళ్లి చేసుకుంటున్నాయి. వారికి పెళ్లి అయినట్లు సర్టిఫికెట్ ను టీటీడీ ఇవ్వడంలో కొత్త న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయి.

అందుకే టీటీడీ తాజాగా కొత్తగా కఠిన నిబంధనలు పెట్టింది. తిరుమలలో పెళ్లి చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా ‘తమకు పెళ్లి కాలేదని’ సర్టిఫికెట్ ను తీసుకురావాలి. ఈ మేరకు తహసీల్దార్ ధ్రువీకరించిన సర్టిఫికెట్ ఉంటేనే టీటీడీ తిరుమలలో వివాహం జరిపిస్తుంది. సర్టిఫికెట్ తీసుకురాకుంటే పెళ్లి చేయరు. ఇలా అక్రమంగా పెళ్లి చేసుకునే జంటలకు చెక్ చెప్పడానికి టీటీడీ కొత్త నిబంధనను తీసుకొచ్చింది.