Begin typing your search above and press return to search.
కొత్త రూల్.. ఆధార్ లేకుండా ఆ మూడు సాధ్యం కాదట!
By: Tupaki Desk | 3 July 2020 6:00 AM ISTనిన్నటి (జులై ఒకటి) నుంచి మొదలైన కొత్త రూల్ పుణ్యమా అని ఆధార్ కార్డు మరింత ముఖ్యం కాదనుంది. కీలకమైన అంశాల విషయంలో ఆధార్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని తేల్చారు. ఒకవేళ ఆధార్ కార్డు లేకుంటే.. సదరు వ్యక్తికి ఆ మూడుసేవలు లభించే అవకాశమే లేదని ప్రభుత్వం తేల్చింది. ఆధార్ తో ముడి పెడుతూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్ విషయానికి వస్తే..
ఆదాయపన్నుకు సంబంధించిన రిటర్న్ దాఖలు చేయాలంటే తప్పనిసరిగా సదరు వ్యక్తి ఆధార్ కార్డు నెంబరును దాఖలు చేయాల్సిందే. అప్పుడు మాత్రమే ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వీలు ఉంటుంది. ఇక.. రెండో విషయానికి వస్తే.. పాన్ కార్డు కావాలంటే.. ఆధార్ కార్డును తప్పనిసరి చేశారు. ఒకవేళ ఆధార్ కార్డు లేకుంటే పాన్ కార్డు ప్రాసెస్ చేయటం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు.
ఇక.. విదేశీ వ్యవహారాల శాఖ కూడా ఆధార్ అవసరాన్ని ప్రస్తావిస్తూ.. ఇకపై పాస్ పోర్టులు ఇవ్వాలంటే ఆధార్ నెంబరు ఇవ్వటం తప్పని సరి చేసింది. జులై ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన ఈ కీలకమైన మార్పులు మీడియా లోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరగాలని చెప్పక తప్పదు. ఈ మూడు అంశాల్లోనే కాదు.. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో పీఎఫ్ అకౌంట్ లోనూ ఆధార్ కార్డు కచ్ఛితం గా లింకు చేయాల్సి ఉంటుంది. ఆధార్ తో పీఎఫ్ ఖాతాను లింకు చేసుకుంటే సులువు గా డబ్బుల్ని విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.