Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రంలో కొత్త రూల్.. హెల్మెట్ లేకుంటే డ్రైవింగ్ లైసెన్సు రద్దు

By:  Tupaki Desk   |   21 Oct 2020 10:15 AM IST
ఆ రాష్ట్రంలో కొత్త రూల్.. హెల్మెట్ లేకుంటే డ్రైవింగ్ లైసెన్సు రద్దు
X
అంతకంతకూ పెరిగిపోతున్నాయి రోడ్డు ప్రమాదాలు. నిర్లక్ష్యం.. అలక్ష్యం.. జాగ్రత్తలు తీసుకోకపోవటం.. నిబంధనల్ని ఫాలో కాకపోవటం లాంటి వాటితో.. పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు నిబంధనలకు భిన్నంగా వాయు వేగంతో వాహనాలు నడపటం.. తాగి డ్రైవింగ్ చేయటం లాంటి తప్పులతో తమ ప్రాణాలకే కాదు.. ఎదుటివారి ప్రాణాల మీదకు తీసుకురావటం పలు సందర్భాల్లో చూస్తుంటాం.

ఇలాంటి తప్పులకు చెక్ పెట్టేందుకు వీలుగా కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వాహనదారులకు దిమ్మ తిరిగేలా చేసింది. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే.. సదరు వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేయాలని డిసైడ్ చేశారు. బైకర్లు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే.. వారి డ్రైవింగ్ లైసెన్సుల్ని మూడు నెలల పాటు రద్దు చేయనున్నట్లుగా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ తరహా రూల్ ను రెండు తెలుగు రాష్ట్రాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారు.. గాయపడుతున్న వారు పెద్ద ఎత్తున పెరుగుతున్నారు. ఈ క్రమంలో కర్ణాటక మోడల్ ను రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫాలో అయితే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. కేసీఆర్.. జగన్ లు ఈ విధానాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేస్తారా?