Begin typing your search above and press return to search.
రైల్వే వెయిటింగ్ లిస్ట్ ఉన్నా జర్నీ పక్కా..?
By: Tupaki Desk | 16 Oct 2015 4:00 AM ISTమారిన పరిస్థితులలో.. అవసరానికి తగినన్ని రైలు బండ్లు లేకపోవటంతో రైల్వే ప్రయాణాలకు నెలల ముందే బుక్ చేసుకోవాల్సిన దుస్థితి. అయితే.. రైల్వేలలో సరికొత్త విధానాన్ని అమలు చేయటానికి రైల్వే శాఖ సిద్ధమవుతోంది. ఈ పద్ధతి కానీ అమల్లోకి వస్తే.. వెయిటింగ్ లిస్ట్ కష్టాలు తీరిపోవటం ఖాయమని చెబుతున్నారు. అంతేకాదు.. వెయిటింగ్ లిస్ట్ లో టిక్కెట్టు ఉన్న వారు.. తాము కోరుకున్న రైల్లో వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్టు దొరికితే.. ఎందుకైనా మంచిదని మరికొన్ని రైళ్లల్లో టిక్కెట్టు కొనేసి ఉంచటం.. ఏది ముందు ఓకే అయితే.. మిగిలినవి క్యాన్సిల్ చేయటం లాంటివి చేస్తుంటారు.
అయితే.. రైల్వే శాఖ కొత్తగా అమల్లోకి తీసుకురానున్న విధానంలో.. ఎవరైనా వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్టు కొనుగోలు చేసే సమయంలో.. ఆ ట్రైన్ లో టిక్కెట్టు కన్ఫర్మ్ కాకుంటే.. అదే రోజు మరో ట్రైన్ లో ప్రయాణానికి ఓకేనా అన్న అంశాన్ని నమోదు చేసుకునే వీలు కల్పిస్తారు. అంతేకాదు.. వేరే స్టేషన్ నుంచి రిజర్వేషన్ లభిస్తే అక్కడ నుంచి ప్రయాణానికి సిద్ధమని కూడా పేర్కొనే సౌలభ్యం కల్పిస్తారు.
దీంతో..వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుడి కోరినట్లుగా రైల్వే శాఖ ఏదో ఒక రైలులో ప్రయాణాన్ని కన్ఫర్మ్ చేస్తుంది. దీంతో.. ఒక రూట్లో ఒక తేదీన ప్రయాణించే ప్రయాణికులు కచ్ఛితమైన సంఖ్య తెలుసుకునే వీలు ఉండటంతో పాటు.. అదనపు రైలు బండికి అవకాశం ఈ విధానంలో కలుగుతుందన్న అంచనాలో రైల్వే అధికారులు ఉన్నారు. తాజా విధానం కానీ కార్యరూపం దాలిస్తే.. వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్టు అయినా ఫికర్ కావాల్సిన అవసరమే ఉండదు.