Begin typing your search above and press return to search.

పోర్న్ చూసే వారిపై కొత్త పరిశోధన

By:  Tupaki Desk   |   31 March 2021 10:00 AM IST
పోర్న్ చూసే వారిపై కొత్త పరిశోధన
X
ఇటీవల ‘వకీల్ సాబ్’ ట్రైలర్ లో పవన్ ఒక డైలాగ్ పేల్చాడు.. ‘నువ్వు వర్జిన్ వా? ’ అని ఓ యువకుడిని అడుగుతాడు. ఆడాళ్లను ఈ ప్రశ్న అడిగితే తప్పులేదు కానీ.. మగాళ్లను అడిగితే తప్పా? అని ప్రత్యర్థి లాయర్ ప్రకాష్ రాజ్ ను పవన్ ప్రశ్నిస్తాడు. ఇప్పుడు అదే తేలింది.

మగాళ్లు దేశంలో పోర్న్ వీడియోలు చూస్తే తప్పులేదు కానీ.. ఆడాళ్లు చూస్తే వారిని దారుణంగా చూస్తున్నారట.. వారు పెద్ద పతివ్రతలు కాదని.. ఆ టైపు మహిళలని భావిస్తున్నారట..

దేశంలో పోర్న్ గురించి ఓ ఆసక్తికర పరిశోధన బయటపడింది. పురుషులు పోర్న్ చూడ్డానికి ఏమాత్రం భయపడట్లేదని వెల్లడైంది. కానీ.. మహిళలు పోర్న్ చూస్తే ద్రోహం చేసినట్లేనన్న ధోరణిలో ఆలోచిస్తున్నారట మగాళ్లు.

ఇక చాలా మంది పోర్న్ వీడియోలు చూసి తమ జీవితాలతో పోల్చి చూసుకొని కుంగుబాటుకు లోనవుతున్నారట.. ఇది తీవ్ర అనర్థాలకు దారితీస్తుందని తేలింది.

ఇది బంధాలపై ప్రభావం చూపుతోందట.. ఇక రెగ్యులర్ గా పోర్న్ చూసేవాళ్లు.. మహిళలను దురుద్దేశంతో చూసే ధోరణి పెరుగుతోందని ఈ పరిశోధన చెబుతోంది. అయితే ఈ పద్ధతి సరికాదని.. శృంగారం విషయంలో ఎవరి స్వేచ్ఛ వారికి ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.