Begin typing your search above and press return to search.
హైదరాబాద్ పిల్లలకు కొత్త ఇబ్బంది.. ఇట్టే కుట్టేసి ఎంచక్కా వెళ్లిపోతుందట
By: Tupaki Desk | 22 Dec 2021 9:13 AM ISTరెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రతి పది ఇళ్లల్లో కనీసం ఐదు ఇళ్లకు చెందిన కుటుంబ సభ్యుడు ఒకడు హైదరాబాద్ లో ఉన్న పరిస్థితి. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఉన్న ఏకైక తెలుగు మహానగరం హైదరాబాదే. అవశాల కుప్పగా ఉండే భాగ్యనగరి అంతకంతకూ విస్తరిస్తోన్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్ లో ఏం జరిగినా.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా ఒక్కసారిగా ఆందోళన చెందే పరిస్థితి. ఇప్పటికే కరోనా.. ఇప్పుడు దానికి సంబంధించిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు టెన్షన్ పుట్టిస్తుంటే.. తాజాగా స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి చాపకింద నీరులా పాకుతోందని చెబుతున్నారు.
పిల్లల్ని టార్గెట్ చేసే ఈ మాయదారి రోగానికి కారణం నల్లిలా ఉండే చిన్న పురుగులని చెబుతున్నారు. తడి ప్రాంతాల్లో.. ఇళ్లల్లోనూ ఉండే ఈ చిన్నపాటి పురుగులు నల్లిలా కుట్టేసి పోవటం.. దాని దెబ్బకు పిల్లలు తీవ్ర అనారోగ్యానికి గురి కావటం ఈ మధ్యన ఎక్కువైనట్లు చెబుతున్నారు.
ఒక్క గాంధీ ఆసుపత్రిలో ఇప్పటివరకు 15 మంది ఈ వ్యాధి బారిన పడినట్లుగా చెబుతున్నారు. గడిచిన వారంలో నలుగురు చిన్నారులు గాంధీలో చేరినట్లుగా చెబుతున్నారు. వీరిలో ఇద్దరికి ఈ వ్యాధి తగ్గిపోగా.. ఇద్దరికి మాత్రం చికిత్స పొందుతున్నారు.నల్లిలా ఉండే ఈ లార్వల్ మైట్స్ కుట్టటం ద్వారా స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకుతుందని చెబుతున్నారు.
ఇళ్లలో మంచాలు.. తడి ప్రాంతంలో ఈ పురుగులు ఉంటాయని.. కాస్త జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. రాత్రి సమయంలో ఎక్కువగా కుట్టే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ చిన్న పురుగులు కుడితే.. పిల్లలకు తీవ్రమైన జ్వరం.. ఒళ్లు.. కండరాల నొప్పులు వస్తాయని.. కొందరికైతే ఒంటి మీద దద్దుర్లు కనిపిస్తాయని చెబుతున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే చికిత్స కోసం వైద్యుడ్ని సంప్రదించటం మంచిదన్న సూచనను పలువురు చేస్తున్నారు. ఎందుకైనామంచి.. జర జాగ్రత్తగా ఉండండి బాస్.