Begin typing your search above and press return to search.
వైసీపీకి కొత్త ఇన్‌చార్జ్‌లు వస్తున్నారు....
By: Tupaki Desk | 8 Oct 2019 3:49 PM ISTఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వైసిపి 151 సీట్లలో విజయం సాధించి తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. మొత్తం 175 సీట్లలో వైసీపీ అభ్యర్థులు కేవలం 24 చోట్ల మాత్రమే ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే నాలుగు నెలల కాలంలో జగన్ ఎన్నో సంచలన సంస్కరణలతో పాలనాపరంగా దూసుకుపోతున్నారు. 2024 ఎన్నికలే టార్గెట్ గా జగన్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ ఓడిపోయిన చోట్ల బలమైన ఇన్‌చార్జ్‌ల ను నియమించి పార్టీని పటిష్టం చేసుకుంటూ... వచ్చే ఎన్నికల్లో అక్కడ వైసీపీ జెండా ఎగరటమే టార్గెట్ గా ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో ఓడిపోయిన కొంతమంది నేతలను పక్కనపెట్టి వారి స్థానంలో కొత్త నేతలకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నారు.
ఈ ప్రక్రియ ఇప్పటికే కొద్ది రోజుల నుంచి కొనసాగుతోంది. పార్టీ ఓడిన చోట్ల ఎవరైతే బలహీనులను పక్కన పెట్టడం... ఇతర సమీకరణలు బేరీజు వేసుకోవడం చేసి వారిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లో గత ఎన్నికల్లో ఓడిన మాజీ ఎమ్మెల్యే బాబ్జిని పక్కన పెట్టి... కౌరు శ్రీనివాస్‌కు బాధ్యతలు అప్పగించారు. ఉండిలో ఓడిపోయిన సీవీల్ నరసింహరాజును తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక రాజమండ్రి సిటీలో ఎన్నికల్లో ఓడిన మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు తప్పించి శికాకుళపు శివ రామ సుబ్రహ్మణ్యం ఇన్చార్జిగా నియమించారు.
ఇక రాజమండ్రి రూరల్ లో వరుసగా రెండుసార్లు ఓడిన ఆకుల వీర్రాజు పక్కనపెట్టి మంగళవారం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణకు బాధ్యతలు ఇస్తారని తెలుస్తోంది. పెద్దాపురంలో యాక్టివ్‌గా లేని తోట వాణికి బదులుగా ఎన్నికలకు ముందు ఇన్‌చార్జ్‌గా ఉన్న దవులూరి దొరబాబు పేరు వినిపిస్తోంది. విజయవాడ తూర్పులో ఎన్నికల్లో ఓడిన బొప్పన కుమార్ ను పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవికి బాధ్యతలు అప్పగిస్తారని టాక్. అంతెందుకు పర్చూరులో దగ్గుపాటి వెంకటేశ్వరరావు యాక్టివ్‌గా ఉండడం లేదనే అక్కడ ఎన్నికలకు ముందు వరకు వైసీపీలో ఉండి... టీడీపీలోకి వెళ్లిన వచ్చిన రావి రామనాథం బాబునె తెరమీదకు తెచ్చారు. పార్టీ ఓడిన చోట్ల పార్టీని బలోపేతం చేసేందుకు జగన్ ఎంత పెద్ద నేతలను అయినా నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టి పార్టీని ఉరుకులు పరుగులు పెట్టించే వారికే అక్కడ బాధ్యతలు అప్పగిస్తున్నారు.