Begin typing your search above and press return to search.

మీది ఇండేన్ గ్యాసా.. అయితే.. ఈ నెంబరును తక్షణమే సేవ్ చేసుకోవాలి

By:  Tupaki Desk   |   1 Nov 2020 10:20 AM IST
మీది ఇండేన్ గ్యాసా.. అయితే.. ఈ నెంబరును తక్షణమే సేవ్ చేసుకోవాలి
X
ఇంట్లో గ్యాస్ పోయ్యి లేనోళ్లు లేరు. మోడీ సర్కారు పుణ్యమా అని.. బడుగు.. బలహీన వర్గాల వారికి సైతం పెద్ద ఎత్తున గ్యాస్ కనెక్షన్లు అందించారు. గ్యాస్ కనెక్షన్లలో అత్యధికంగా హెచ్ పీ.. ఇండేన్ కు చెందిన కంపెనీలవే ఎక్కువగా ఉంటాయి. తాజాగా ఇండేన్ గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవటానికి దేశ వ్యాప్తంగా ఒకటే నెంబరును అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇక నుంచి ఎవరైనా సరే.. ఇండేన్ గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవాలంటే.. 77189 55555 నెంబరుకు కాల్ చేసినా.. ఎస్ఎంఎస్ చేసినా సరిపోతుంది. కాల్ చేయటంతో సదరు వినియోగదారుడి బుకింగ్ ను ఆటోమేటిక్ గా స్వీకరిస్తుంది. ఇప్పటివరకు ప్రాంతాల వారీగా నెంబర్లు ఉండేవి. ఆయా ప్రాంతాల వారు ఆయా నెంబర్లకు ఫోన్లు చేసి సిలిండర్ ను బుక్ చేసుకోవాల్సి ఉండేది.

ఈ రోజు (ఆదివారం) నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. దీని ప్రకారం దేశ వ్యాప్తంగా ఒకటే నెంబరును అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవటమే కాదు.. చెల్లింపుల విషయంలోనూ క్యాష్ మాత్రమే ఇవ్వాల్సిన అవసరం లేదని.. పేటీఎం.. అమెజాన్.. గూగుల్.. ద్వారా కూడా పే చేయొచ్చు. సిలిండర్ల బుకింగ్ మొదలు.. మరిన్ని వివరాలు కావాలంటే https://cx.indianoil.in వెబ్ సైట్ ను సందర్శించటం ద్వారా తెలుసుకునే సదుపాయం ఉంది. ఇంతకీ.. నెంబరును మీ ఫోన్ లో సేవ్ చేసుకున్నారా?